Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: సీఎస్‌కే అతన్ని అస్సలు కొనుగోలు చేయవద్దు: శ్రీకాంత్

పీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఫ్రాంచైజీకి భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక సలహా ఇచ్చాడు. ఎట్టిపరిస్థితుల్లో మతీషా పతీరణాను సీఎస్‌కే తిరిగి కొనుగోలు చేయకూడదని సూచించాడు. అతనికి బదులుగా సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జ్‌ను తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. మంగళవారం అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ వ్యూహాలతో వేలానికి సిద్దమయ్యాయి.

ఐపీఎల్ 2025 సీజన్‌లో పతిరణా 12 మ్యాచ్‌లలో 13 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 10కి పైగా ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకొని తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే, 2022 నుంచి సీఎస్‌కే డెత్ బౌలర్‌గా కొనసాగుతున్న పతిరణ.. 2023లో ఆ జట్టు ఐదో టైటిల్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

Kris Srikkanth Suggests CSK Should Target This Player Instead of Pathirana at IPL 2026 Auction

ఐపీఎల్ 2026 మినీ వేలం నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తమిళ్ ఛానెల్‌లో సీఎస్‌కే మాజీ క్రికెటర్ బద్రీనాథ్‌తో కలిసి శ్రీకాంత్ మాట్లాడాడు. మతీషా పతీరణాకు బదులు అన్రిచ్ నోర్జ్‌ను తీసుకుంటే సీఎస్‌కే బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందని చెప్పాడు. 'నేను అయితే పతిరణాను మళ్లీ తీసుకోవద్దనే చెబుతాను.

పతిరణాకు బదులు నోర్జ్‌ను ఎంచుకోవాలి. అయితే నోర్జ్‌ను కూడా కాస్త తీర్చిదిద్దాలి. అతని వేగవంతమైన బౌలింగ్ సామర్థ్యం సీఎస్‌కేకు కలిసి వస్తుంది. జాకబ్ డఫీ వంటి విదేశీ ఫాస్ట్ బౌలర్‌ను కూడా సీఎస్‌కే తీసుకునే ప్రయత్నం చేయాలి. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ ఉన్నా.. 14 మ్యాచ్‌ల పాటు వీరిపై నమ్మకం ఉంచలేం.’అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

మాజీ క్రికెటర్ సుబ్రమణియం బద్రీనాథ్.. మతీశ పతిరణా, అన్రిచ్ నోర్ట్జేలు కనీసం రూ. 10 కోట్ల ధర పలుకుతారని తెలిపాడు. ఈ ఇద్దరికి భారీ డిమాండ్ ఉందని అభిప్రాయపడ్డాడు. మతీశ పతిరణా, అన్రిచ్ నోర్ట్జ్ కోసం సీఎస్‌కే గట్టిగా ప్రయత్నిస్తుందని తెలిపాడు.

'ఇతర జట్ల దగ్గర డబ్బులు తక్కువగా ఉన్ననేపథ్యంలో పతిరణ, నోర్ట్జేలలో ఒకరు సీఎస్‌కేకు, మరొకరు కేకేఆర్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఇరు జట్లకు డెత్ బౌలర్ అవసరం ఉంది. పతిరణాను వదిలేసిన సీఎస్‌కే, నోర్ట్జ్ లేదా గెరాల్డ్ కోయెట్జీలో ఒకర్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.’అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో కేకేఆర్ తరపున అన్రిచ్ నోర్జ్ నిరాశపర్చాడు. రెండు మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ మాత్రమే తీసాడు.

FAQs
MyKhel Sports
Story first published: Monday, December 15, 2025, 17:55 [IST]
Other articles published on Dec 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+