Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పేస్‌కు భయపడుతున్నాడు.. తిలక్ వర్మను జట్టు నుంచి తప్పించండి: మాజీ క్రికెటర్

టీమిండియా టీ20 వైస్ కెప్టెన్, తెలుగు తేజం తిలక్ వర్మపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి విమర్శలు గుప్పించాడు. పేస్ బౌలింగ్‌కు, బౌన్సర్లకు తిలక్ వర్మ భయపడుతున్నాడని, అందుకే లేట్‌గా క్రీజులోకి వస్తున్నాడని తెలిపాడు. ఔటవ్వకూడదనే ఆలోచనతో ఆడుతున్న తిలక్ వర్మను తుది జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేశాడు. అతని స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించాలని తాను పదే పదే చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నాడు.

అచ్చొచ్చిన మైదానంలో అయ్యర్ గెలిచేనా..?

అచ్చొచ్చిన మైదానంలో అయ్యర్ గెలిచేనా..?

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా వరుస పరాజయాలతో సతమతమవుతుంది. ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి 2-0తో వెనుకంజలో నిలిచింది. నేడు(జూలై 9) జరిగే నాలుగో టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు కీలకం.

Kris Srikanth slams Tilak Varma as clueless against pace and bounce and Urgues Drop him for Sanju Samosn

పేస్‌‌కు భయపడుతున్నాడు..

ఈ మ్యాచ్ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ' తిలక్ వర్మ టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. భవిష్యత్తులో సారథ్య బాథ్యతలు కూడా చెపట్టే అవకాశం ఉంది. అతను క్రీజులోకి వచ్చాక ఔటవ్వకూడదనే ఉద్దేశంతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. పేస్ బౌలింగ్, బౌన్సర్లకు భయపడుతున్నాడు. దాంతోనే ముందుగా బ్యాటింగ్‌‌కు రావడం లేదు. అతని స్థానంలో సంజూ శాంసన్ ఆడించడం ఉత్తమం

తిలక్ వర్మను టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రధాన బ్యాటర్‌గా ఎంచుకుంది. కానీ పేసర్లను ఎదుర్కొనే విషయంలో అతన్ని వెనకేసుకొస్తుంది. తిలక్ వర్మ కంటే ముందు అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపిస్తున్నారు. షార్ట్ పిచ్‌ బంతులను ఆడటంలో తిలక్ వర్మ తడబడుతానే విషయం మేనేజ్‌మెంట్‌కు తెలుసు. అందుకే అతన్ని ముందుగా బ్యాటింగ్‌కు పంపించడం లేదు. తిలక్ వర్మను జట్టు నుంచి తప్పించాలి. అప్పుడే తన తప్పిదాలను సరిదిద్దుకొని మెరుగవుతాడు. తిలక్‌ను తీసేయాలని నేను పదే పదే చెబుతన్నా. కానీ నా మాట ఎవరూ వినడం లేదు.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

IND vs ENG 4th T20I: టీమిండియా జిడ్డు బ్యాటర్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్!

IND vs ENG 4th T20I: టీమిండియా జిడ్డు బ్యాటర్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్!

వైస్ కెప్టెన్‌గా పేలవ ప్రదర్శన..

వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తిలక్ వర్మ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో 19, 55 పరుగులు చేసిన తిలక్.. ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా 13, 24*, 3 పరుగులే చేశాడు. ఐర్లాండ్‌తో రెండో టీ20లో 55 పరుగులు చేసినా స్లో బ్యాటింగ్‌తో విమర్శల పాలయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

Story first published: Thursday, July 9, 2026, 17:49 [IST]
Other articles published on Jul 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+