ఈ బౌలింగ్‌తో వరల్డ్ కప్ గెలవడం అసాధ్యం: మాజీ క్రికెటర్ ఫైర్!
వెస్టిండీస్ జట్టుతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పరాజయంపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. గత మ్యాచ్‌లో గెలిచినప్పటికీ 400కి పైగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలింగ్ విభాగం, ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ పూర్తిగా విఫలమైంది. భారత బౌలింగ్ తీరుపై తన యూట్యూబ్ ఛానెల్ 'చీకీ చీకా'లో మాట్లాడిన శ్రీకాంత్.. జట్టు యాజమాన్యం తీసుకుంటున్న సెలెక్షన్ నిర్ణయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ మ్యాచ్‌లో బౌలింగ్ నిర్వహణ, ఆటగాళ్ల ఎంపికపై క్రిస్ శ్రీకాంత్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. మహ్మద్ సిరాజ్‌కు ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉన్నప్పటికీ.. చివరి ఓవర్‌ను యువ బౌలర్ అన్షుల్ కంబోజ్‌కు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. "భారత బౌలింగ్ ఎంతో సాధారణంగా ఉంది. ఇలాంటి బౌలింగ్ దాడితో ప్రపంచకప్ గెలిచే అవకాశమే లేదు. గుర్నూర్ బ్రార్, అన్షుల్ కంబోజ్ వంటి ఆటగాళ్లను అకస్మాత్తుగా జట్టులోకి తెచ్చి రేసులో నిలబెట్టాలని చూడటంలో ఎలాంటి తర్కం లేదు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తప్ప మిగిలిన పూర్తిస్థాయి జట్టు ఉన్నప్పటికీ వెస్టిండీస్ వంటి బలహీనమైన జట్టు చేతిలో ఓడిపోవడం దారుణం" అని క్రిస్ శ్రీకాంత్ విమర్శించారు. కాగా ఈ మ్యాచ్‌లో గుర్నూర్ బ్రార్, అన్షుల్ కంబోజ్ కలిసి 18.1 ఓవర్లలో ఏకంగా 146 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్ తీశారు.

అలాగే యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రదర్శనపై కూడా క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్యా గాయపడటంతో నితీష్ కుమార్ రెడ్డిని పేస్-బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో 16 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేయగా.. బౌలింగ్‌లో 6.5 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కొద్దిగా బౌన్స్ ఉన్న వికెట్లపై నితీష్ బ్యాటింగ్ తీవ్రంగా తడబడుతోందని, వరుసగా పరుగులు ఇస్తున్నా బౌలింగ్ వేయించడం ఆశ్చర్యకరమని క్రిస్ శ్రీకాంత్ పేర్కొన్నారు. అతడిని ఎలాగైనా ఆల్‌రౌండర్‌గా మార్చాలని మేనేజ్మెంట్ పట్టుబట్టడం భారత క్రికెట్‌కు మంచి సంకేతం కాదని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు ఆడిన 8 వన్డేల్లో నితీష్ బౌలింగ్ లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీసి 91.33 సగటుతో ధారాళంగా పరుగులు ఇచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


