సరిగ్గా బౌలింగ్, బ్యాటింగ్ చేయడు.. ఫీల్డింగ్ రాదు! ఏ లెక్కన ఆడిస్తున్నారు: క్రిష్ శ్రీకాంత్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై మాజీ సెలెక్టర్ క్రిష్ శ్రీకాంత్ మరోసారి విమర్శలు గుప్పించాడు. సరిగ్గా బౌలింగ్, బ్యాటింగ్ చేయకున్నా.. ఫీల్డింగ్ రాకున్నా అతన్ని జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించాడు. ఈ ప్రపంచం మునిగినా అతన్ని జట్టులో కొనసాగించేలా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనలో శివమ్ దూబే దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అతను తీవ్రంగా నిరాశపర్చాడు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో శివమ్ దూబే 130.76 స్ట్రైక్‌రేట్, 21.25 సగటుతోనే పరుగులు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఎన్నో సునాయస క్యాచ్‌లను వైభవ్ వదిలేసాడు. అయినా టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించాడనే కారణంతో శివమ్ దూబేను జట్టులో కొనసాగిస్తున్నారు.

ఏ లెక్కన అతన్ని ఆడిస్తున్నారు.
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లోనూ శివమ్ దూబే బరిలోకి దిగనున్నాడు. గురువారం తొలి టీ20 జరగనుండగా.. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. శివమ్ దూబేపై విమర్శలు గుప్పించాడు. 'శివమ్ దూబేకు ఎలాంటి అదృష్టం ఉందో నాకు తెలియదు. కానీ అతన్ని జట్టు నుంచి ఎప్పుడూ తొలగించరు. ఉరుములు, మెరుపులతో ఈ ప్రపంచం మునిగినా.. శివమ్ దూబే జట్టులోనే కొనసాగుతాడు.
క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తేనే సరిపోదు. ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యం. ఫీల్డింగ్‌లో శివమ్ దూబేకు సున్నా మార్కులు వస్తాయి. అలాంటప్పుడు శివమ్ దూబేను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు. ఐపీఎల్‌లో బాగా రాణించిన ఎంతో మంది యువ ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు శివమ్ దూబే 71 టీ20లు ఆడి, 29.50 సగటు, 152 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. 9.76 ఎకానమీతో పాటు 26.22 సగటుతో 36 వికెట్లు తీసాడు.
10 మ్యాచ్‌ల్లో ఆడాలి..
టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి వరుసగా 10 అవకాశాలు ఇవ్వాలని క్రిష్ శ్రీకాంత్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. 'వైభవ్ సూర్యవంశీకి వరుసగా 10 మ్యాచ్‌లు ఆడించాలి. కేవలం మూడు మ్యాచ్‌లకే పక్కనపెట్టవద్దు. జింబాబ్వేతో సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చి.. నిర్భయంగా ఆడాలని చెప్పాలి. అతను కచ్చితంగా రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపిస్తాడు.
అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలనుకుంటున్నాను. ఈ సిరీస్‌లో అతను భారీగా పరుగులు చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. అతనికి టీ20 జట్టులో శాశ్వత స్థానం లభించి, భవిష్యత్తులో వన్డేలు కూడా ఆడాలన్నదే నా కోరిక'అని శ్రీకాంత్ పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

