ఫోజు కొట్టడం తప్ప పీకింది ఏం లేదు.. రియాన్ పరాగ్‌పై మాజీ కెప్టెన్ ఫైర్!
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రియాన్ పరాగ్ ఫోజు కొట్టడం తప్ప రాణించింది ఏం లేదని మండిపడ్డాడు. కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా అతను దారుణంగా విఫలమయ్యాడని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వరుసగా నాలుగు విజయాల తర్వాత తొలి ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. రియాన్ పరాగ్ చెత్త కెప్టెన్సీతోనే రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు.

ఫోజు కొట్టడానికే ఉన్నాడు..
'రియాన్ పరాగ్ జట్టులో ఫోజు కొట్టడానికే ఉన్నాడు. స్టైల్‌గా బ్యాటింగ్‌కు వచ్చి త్వరగా ఔటయ్యాడు. ప్రెజెంటేషన్ వేడుకలో మాట్లాడి వెళ్లిపోయాడు. అంతా ఫోజు కొట్టడం తప్పా మరేమీ చేయలేదు. జడేజా వంటి సీనియర్ బౌలర్‌కు బౌలింగ్ ఇవ్వలేదు. ఎందుకని అడిగితే.. రవి బిష్ణోయ్‌నే సన్‌రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారని, లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ మెరుగ్గా ఆడుతుండటంతో బౌలింగ్ ఇవ్వలేదని చెప్పాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్.. లెఫ్టార్మ్ బ్యాటర్‌కు బౌలింగ్ చేయకూడదనే రూల్ ఏమైనా ఉందా? ఇది అసంబద్దం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ప్రఫుల్ హింగే తొలి ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ కూడా చాలా బాగుంది. వారికి నలుగురు యువ బౌలర్లున్నారు. వారితోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఆలౌట్ చేశారు. అద్భుతం.’అని క్రిష్ శ్రీకాంత్ కొనియాడాడు.
అల్లాడించిన ప్రఫుల్ హింగే..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో 4 సిక్స్‌లతో 28), సలీల్ అరోరా(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/37) రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డోనవన్ ఫెరీరా(44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69), రవీంద్ర జడేజా(32 బంతుల్లో 5 ఫోర్లతో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే(4/34), సకీబ్ హుస్సేన్(4/24) నాలుగేసి వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగా(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ప్రఫుల్ హింగే మూడు వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications