Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనికి పిల్లలాట అయిపోయింది.. గంభీర్‌పై క్రిష్ శ్రీకాంత్ ఫైర్!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి విమర్శలు గుప్పించాడు. గంభీర్ తన అనాలోచిత నిర్ణయాలతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాడని, అతన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో అద్వితీయమైన ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఐర్లాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే ఈ సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లోనూ తొలి మ్యాచ్ ఆడించలేదు. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడించగా.. వైభవ్ విఫలమయ్యాడు. దాంతో ఆఖరి మ్యాచ్‌కు అతన్ని తప్పించారు.

IND vs ZIM: మ్యాచ్ విన్నర్ ఔట్.. జింబాబ్వేతో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ZIM: మ్యాచ్ విన్నర్ ఔట్.. జింబాబ్వేతో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

బుడ్డోడి బ్యాటింగ్‌కు ఫిదా

జింబాబ్వే పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ రికార్డ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 18 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాది అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

Kris Srikkanth Slams Gautam Gambhir for dropping Vaibhav Sooryavanshi Says Crushed His Confidence

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు ఫిదా అయిన కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పరుగులు చేయడం అతనికి చిన్నపిల్లలాట అయిపోయిందని కితాబిచ్చాడు.

ఎంత తెలివి తక్కువతనం

'వైభవ్ సూర్యవంశీ చాలా అలవోకగా షాట్స్ ఆడుతాడు. అతను ఒక్క షాట్ కూడా మిస్‌టైమ్ చేయలేదు. ఈ కుర్రాడు నిజంగా చాలా ప్రత్యేకమైనవాడు. ఇంత టాలెంటెడ్ ప్లేయర్‌ను మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడని గంభీర్ తప్పించడం ఎంత తెలివితక్కువతనం. ఇలా చేసి వైభవ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాడు.

18 బంతుల్లో 50.. వైభవ్ సూర్యవంశీ‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎందుకు రాలేదంటే..?

18 బంతుల్లో 50.. వైభవ్ సూర్యవంశీ‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎందుకు రాలేదంటే..?

వైభవ్ సూర్యవంశీ డెడికేషన్‌‌కు సెల్యూట్. ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం వైభవ్ నేరుగా ఇంటికి వెళ్లకుండా రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌కు వెళ్లాడు. అక్కడ తన షార్ట్ బాల్స్‌ సమస్యపై వర్క్ చేశాడు. తాను ప్రత్యేకమైన ఆటగాడినని ప్రపంచానికి చూపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు.

పిల్లలాట అయిపోయింది..

చాలా సునాయసంగా 250 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం అసాధారణం. సాధారణంగా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన తర్వాత ఇతర ఆటగాళ్లు సింగిల్స్, డబుల్స్ తీస్తూ జట్టులో తమ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వైభవ్ సూర్యవంశీ ఇవేవి పట్టించుకోకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 18 బంతుల్లో 50 పరుగులు చేయడం వైభవ్‌కు చిన్న పిల్లల ఆట అయిపోయింది. ఇదే అతని గొప్పతనం.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, July 25, 2026, 14:00 [IST]
Other articles published on Jul 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+