భారత జట్టును గంభీర్ గబ్బు పట్టిస్తున్నాడు: క్రిష్ శ్రీకాంత్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి విమర్శలు గుప్పించాడు. గంభీర్ తన అనాలోచిత నిర్ణయాలతో టీమిండియాను గబ్బు పట్టిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీలు విఫలమయ్యేలా చేసిన గంభీర్.. వన్డేల్లో కేఎల్ రాహుల్ కెరీర్‌ను నాశనం చేస్తున్నాడని మండిపడ్డాడు.
కీలక బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్ పంపించడం ఏంటని ప్రశ్నించాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో కేఎల్ రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో కూడా అతను ఇలానే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అయితే కేఎల్ రాహుల్‌కు నెంబర్ 5లో మంచి రికార్డ్ ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా గంభీర్ పేరు ప్రస్తావించకుండా క్రిష్ శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.

మ్యాచ్ విన్నర్‌ను ఆరో స్థానంలో ఆడిస్తారా?
'భారీ లక్ష్య ఛేదనలో ఎవరైనా కేఎల్ రాహుల్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తారా? రాహుల్ ఇప్పటికే ఎన్నో కఠినమై లక్ష్యాలను ఛేదించి విజయాలు అందించాడు. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీలను నాశనం చేసినట్లే ఇప్పుడు కేఎల్ రాహుల్ కెరీర్‌ను నాశనం పట్టిస్తున్నారు. రాహుల్ ఏమైనా నెంబర్ 6, నెంబర్ 7 బ్యాటరా? ఇది అన్యాయం. మూడో వన్డేలో అతని బాడీ లాంగ్వేజ్ కూడా ఎవరో కంగారు పెడుతున్నట్లుగా కనిపించింది.
ఈ మ్యాచ్‌లో భారత్‌కు జోస్ బట్లర్ పాత్రను పోషించే బ్యాటర్ అవసరం ఏర్పడింది. కానీ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ త్వరగా ఔటయ్యారు. కేఎల్ రాహుల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించి ఉంటే విరాట్ కోహ్లీకి అండగా ఉండేవాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో రాహుల్ ఈ పాత్ర పోషించాడు.
ఆరో స్థానంలో ఆడిస్తే ఏం చేయగలడు..
కేఎల్ రాహుల్‌కు నిదానంగా ఆడుతూ ఒక్కసారిగా ఇన్నింగ్స్ వేగాన్ని పెంచే సామర్థ్యం ఉంది. కానీ అతన్ని మ్యాచ్ మొత్తం చేజారిపోయిన తర్వాత బ్యాటింగ్‌కు పంపించారు. భారత్ విజయానికి ఓవర్‌కు 15 పరుగులు కావాల్సిన పరిస్థితుల్లో రాహుల్‌ను బ్యాటింగ్‌కు పంపిస్తే అక్షర్ పటేల్‌తో కలిసి అతను ఏం చేయగలడు.'అని క్రిష్ శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశాడు.
మూడో వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులే చేసి వెనుదిరిగాడు. తొలి మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు చేశాడు. అనారోగ్యంతో రెండో వన్డే ఆడలేదు. ఈ సిరీస్‌ను భారత్ 1-2తో ఇంగ్లండ్‌కు కోల్పోయిన విషయం తెలిసిందే. చెత్త బౌలింగ్‌తో టీమిండియా మూల్యం చెల్లించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


