Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ పేరిట సీఎస్‌కే భారీ మోసం: మాజీ క్రికెటర్

మహేంద్ర సింగ్ ధోనీ పేరిట చెన్నై సూపర్ కింగ్స్(CSK) అభిమానులను దారుణంగా మోసం చేసిందని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ధోనీకి గాయం అంటూ ఈ సీజన్ మొత్తం ఓ పెద్ద డ్రామా ఆడిందని మండిపడ్డాడు.

సీఎస్‌కే యాజమాన్యం కారణంగా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారని అసహనం వ్యక్తం చేశాడు. ధోనీ రాక కోసం అభిమానులు ప్రతీ మ్యాచ్‌లో ఎదురు చూసారని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే కాలి గాయానికి గురైన ధోనీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ సీఎస్‌కే యాజమాన్యం మాత్రం ధోనీ గాయం విషయాన్ని దాచి అభిమానులను తప్పుదోవ పట్టించింది. ధోనీ ప్రాక్టీస్ సెషన్స్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేసి.. సొమ్ము చేసుకుంది.

IPL 2026: ఆ నలుగురు ఆటగాళ్లకి CSK గుడ్‌బై!

IPL 2026: ఆ నలుగురు ఆటగాళ్లకి CSK గుడ్‌బై!

గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సీఎస్‌కే ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ అనంతరం కూడా ధోనీ భవితవ్యంపై రుతురాజ్ గైక్వాడ్ స్పష్టత ఇవ్వలేదు. వచ్చే సీజన్‌లోనే క్లారిటీ వస్తుందని చెప్పాడు.

Kris Srikkanth Slams CSK Management and Ruturaj Gaikwad Over MS Dhoni s Injury Fake-Outs and Misleading Fans

అయితే ఈ వ్యాఖ్యలపై శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మండిపడ్డాడు. 'ఈ సీజన్ ప్రారంభం కావడానికి ముందే ధోనీకి కాలి గాయం అయిందని.. అతను త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నామని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ చెప్పింది. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇదే పాట పాడాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇదే పాట అందుకున్నాడు.

'ధోనీ బహుశా తదుపరి మ్యాచ్‌కల్లా సిద్ధంగా ఉండొచ్చు' అంటూ చెప్పుకొచ్చారు. మళ్లీ మ్యాచ్‌కు ముందు చూస్తే.. ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను సీఎస్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తద్వారా ధోనీ ఫిట్‌గా ఉన్నాడని, మ్యాచ్ ఆడబోతున్నాడనే సంకేతాలను అభిమానులకు ఇచ్చారు

తీరా మ్యాచ్ సమయానికి వచ్చేసరికి, 'లేదు, లేదు.. అతను ఇంకా గాయం నుంచి కోలుకుంటున్నాడు. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదు' అని చెప్పారు. ఆ తర్వాతేమో అతనికి తొడ భాగంలో గాయమైందని అన్నారు. దయచేసి ఈ మోసపూరిత నాటకాలను ఆపండి. ఏదైనా ఉంటే స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ అతను ఈ సీజన్ మొత్తం ఆడటం లేదు అని ముందే చెప్పేస్తే సరిపోయేది కదా. మీరే గనుక ఆ విషయాన్ని ముందుగానే స్పష్టం చేసి ఉంటే.. అభిమానులు మానసికంగా సిద్ధపడి ఉండేవారు.'అని క్రిష్ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 రుతురాజ్‌పై బూతుల వర్షం.. సీఎస్కే ఫ్యాన్స్‌పై అశ్విన్ ఫైర్!

రుతురాజ్‌పై బూతుల వర్షం.. సీఎస్కే ఫ్యాన్స్‌పై అశ్విన్ ఫైర్!
Story first published: Friday, May 22, 2026, 16:54 [IST]
Other articles published on May 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+