రోహిత్ శర్మ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఓపెనర్: మాజీ క్రికెటర్

ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ కృష్టమాచారి శ్రీకాంత్ ప్రశంసల జల్లు కురిపించాడు. వన్డే ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్ ఆల్‌టైమ్ గ్రేటేస్ట్ ఓపెనర్ అని కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టడ్ షోలో పాల్గొన్న ఈ మాజీ కెప్టెన్.. రోహిత్ విధ్వంసకర బ్యాటింగ్ గురించి మాట్లాడూతూ.. గ్రేటెస్ట్ ఓపెనర్లలో ఒకడిగా రేటింగ్ ఇస్తానన్నాడు.
'వన్డేల్లో రోహిత్ కచ్చితంగా టాప్-5 ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనర్లలో ఒకడిగా నిలుస్తాడు. నేనైతే వన్డేల్లో అతనికి గ్రేటెస్ట్ ఓపెనర్లలో ఒకడిగా రేటింగ్ ఇస్తా. పెద్ద సెంచరీలను డబుల్ సెంచరీలుగా మార్చడమే రోహిత్‌లో గొప్ప లక్షణం. వన్డే మ్యాచ్‌లో ఓ ప్లేయర్ 150, 180, 200 రన్స్ చేస్తున్నాడంటే జట్టును ఏస్థాయికి తీసుకెళ్తున్నాడో ఊహించుకోవచ్చు. రోహిత్ గ్రేట్‌నెస్ అదే'అని 1981-1982 మధ్య భారత్ తరఫున 43 టెస్టులు, 146 వన్డేలు ఆడిన 60 ఏళ్ల శ్రీకాంత్ తెలిపాడు.
ఇక 30 ఏళ్ల రోహిత్ ఓపెనర్‌గా 140 వన్డేల్లో 58.11 యావరేజ్‌తో 7148 రన్స్ బాదాడు. అందులో 27 సెంచరీలున్నాయి. వన్డేల్లో వేగంగా 7వేల రన్స్ చేసిన ఓపెనర్‌గాను నిలిచాడు. ఓవరాల్‌గా 224 వన్డేలు ఆడిన హిట్ మ్యాన్ 49.27 సగటు, 29 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలతో 9115 పరుగులు చేశాడు. మూడు డబుల్ సెంచరీలతో వరల్డ్ రికార్డు సృష్టించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264. ఇక 32 టెస్ట్‌ల్లో 2141 రన్స్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications