ఇదేం వివక్ష.. అభిషేక్‌కు ఒక న్యాయం! సంజూకు మరో న్యాయమా?: మాజీ సెలెక్టర్
భారత సెలెక్టర్ల ద్వంద్వ వైఖరిని టీమిండియా మాజీ సెలెక్టర్ క్రిష్ శ్రీకాంత్ నిలదీసాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ఒక న్యాయం? సంజూ శాంసన్‌కు మరో న్యాయమా? అని ప్రశ్నించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంజూ శాంసన్‌ను ఎందుకు పక్కన పెట్టారని నిలదీసాడు.
అదే సమయంలో సుదీర్ఘ కాలం పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు ఎందుకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారని ప్రశ్నించాడు. జింబాబ్వేతో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. మూడు టీ20ల సిరీస్‌లో అభిషేక్ శర్మ వరుసగా 1, 8, 2 పరుగులే చేశాడు. ఈ వైఫల్యాన్ని నిలదీస్తూ.. భారత సెలెక్టర్ల ద్వంద్వ వైఖరిని క్రిష్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఎండగట్టాడు.

అభిషేక్‌లా సంజూకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు..
'ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్. అభిషేక్ శర్మలా అతనికి ఎందుకు వరుసగా అవకాశాలు రావడం లేదు? ఇది న్యాయమైన ప్రశ్న. సుదీర్ఘకాలంగా విఫలమవుతున్నా అభిషేక్ శర్మకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. అలాగే సంజూ శాంసన్‌కు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు? ఒక ప్లేయర్‌కు ఒక న్యాయం.. మరో ప్లేయర్‌కు మరో న్యాయం ఎందుకు?
సంజూ శాంసన్ పుంజుకుంటాడని ఆశిస్తున్నా. పరుగులు చేయడానికి అతను మరో మార్గాన్ని వెతుక్కోవాలి. లేదా.. కొన్ని బంతుల పాటు నెమ్మదిగా ఆడాలి. అతను ఎప్పుడైనా పుంజుకోగల ఆటగాడు. ఆరంభంలో 100 స్ట్రైక్ రేట్‌తో నిదానంగా ఆడి.. ఆ తర్వాత దాన్ని 200కి పెంచుకోవాలి. అంతేగానీ అవకాశాలను వృధా చేయకూడదు.'అని క్రిష్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
మూడు మ్యాచ్‌ల్లో విఫలమవ్వగానే..
ఐర్లాండ్ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ విఫలమయ్యాడు. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా విఫలమవడంతో తర్వాతి మూడు మ్యాచ్‌లకు అతన్ని పక్కనపెట్టారు. ఆఖరి మ్యాచ్‌లో సంజూ శాంసన్ రీఎంట్రీ ఇచ్చినా 27 పరుగులే చేశాడు. అయితే జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న సంజూ శాంసన్‌ను ఆఖరి టీ20 ఆడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అది కూడా జింబాబ్వే పర్యటనలో భాగంగా ఉన్న వైభవ్ సూర్యవంశీని తప్పించి మరీ సంజూను ఆడించడం విచిత్రంగా అనిపించింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్‌తో సూపర్ 8 గేమ్‌లో 97 పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

