Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శభాష్ రాణా.. నా నోరు మూయించావ్: క్రిష్ శ్రీకాంత్

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఈ పర్యటనకు హర్షిత్ రాణాను ఎంపిక చేయడాన్ని విమర్శించానని, ఇప్పుడే తానే ప్రశంసిస్తున్నానని తెలిపాడు.

గంభీర్ ప్రియ శిష్యుడు కావడంతోనే హర్షిత్ రాణాకు మూడు ఫార్మాట్లలో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయని క్రిష్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విమర్శించాడు. అయితే ఈ విమర్శలపై గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. యూట్యూబ్ వ్యూస్ కోసం కుర్రాళ్లను విమర్శించడం సరికాదని మండిపడ్డాడు. అవసరమైతే తనను విమర్శించాలని సూచించాడు.

Kris Srikkanth Praises Harshit Rana s Superb Bowling After Sydney ODI 4-Wicket Haul

తొలి రెండు వన్డేల్లో ఒక్కో వికెట్ మాత్రమే తీసిన హర్షిత్ రాణా.. ఆఖరి వన్డేలో నాలుగు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 6 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనపై తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'మూడో వన్డేలో హర్షిత్ రాణా అద్భుతంగా రాణించాడు. ప్రశంసలకు అతను పూర్తి అర్హుడు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. అతని ఎంపికపై నేను చాలా విమర్శలు చేశా. ఆ విమర్శలకు అతను ఆటతోనే బదులిచ్చాడు. అసాధారణంగా బౌలింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో టెయిలెండర్‌గా బరిలోకి దిగి విలువైన పరుగులు చేశాడు. చివరి వన్డేలో తొలి స్పెల్ నుంచే నాణ్యమైన బౌలింగ్ చేశాడు.

అతని ఆత్మవిశ్వాసం రోజు రోజుకూ పెరిగిపోతుంది. మూడో వన్డేలో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇందులో నా ఫేవరెట్ వికెట్ మాత్రం ఓవెన్‌ను ఔట్ చేయడమే. రాణా అద్భుతమైన బంతికి రోహిత్ శర్మ అసాధారణ క్యాచ్ అందుకున్నాడు. చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశాడు. మరీ ఎక్కువగా షార్ట్ బాల్స్ వేయలేదు. అలాగే స్లో బౌలింగ్ కూడా చేయలేదు.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా శ్రీకాంత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోల్పోయినా జట్టులో పెద్దగా మార్పులు చేయవద్దని గంభీర్‌కు సూచించాడు. గంభీర్ మార్గదర్శకత్వంలో టీమిండియా రెండు రకాల ఫలితాలను అందుకుంటుందని చెప్పాడు. ఇందులో ఒకటి భారీ విజయం అయితే మరొక ఘోర పరాజయం ఉందని తెలిపాడు. అలా అతని అతను తొందరపడి మార్పులు చేయవద్దని సూచించాడు.

Story first published: Sunday, October 26, 2025, 17:08 [IST]
Other articles published on Oct 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+