For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంభీర్.. నీ పిచ్చి ప్రయోగాలతో అతనికి తీరని అన్యాయం: భారత మాజీ క్రికెటర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్, 1983 వరల్డ్‌కప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్చి ప్రయోగాలతో కేఎల్ రాహుల్‌కు తీరని అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డాడు. నెంబర్ 5లో కేఎల్ రాహుల్‌కు మెరుగైన రికార్డ్ ఉందని, కానీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతన్ని ఆరో స్థానంలో ఆడించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యత ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్ అతన్ని ఐదో స్థానంలో కాకుండా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించింది.

లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్‌ను ఐదో స్థానానికి ప్రమోట్ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో 9 బంతుల్లో 2 పరుగులే చేసిన రాహుల్.. రెండో వన్డేలో 14 బంతుల్లో 10 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఇక రాహుల్‌ను ఆరోస్థానంలో ఆడించాలనుకున్నప్పుడు.. రిషభ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Gautam Gambhir Kris Srikkanth

రాహుల్‌కు అన్యాయం..
ఈ క్రమంలో క్రిష్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాహుల్‌ను ఆరో స్థానంలో ఆడించడాన్ని తప్పుబట్టాడు. 'శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. కానీ దురదృష్టవశాత్తు కేఎల్ రాహుల్‌కు అన్యాయం జరుగుతుందనిపిస్తోంది. అక్షర్ పటేల్ 30, 40 పరుగులతో బాగానే ఆడుతున్నాడు. కానీ కేఎల్ రాహుల్‌ పట్ల మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు సరికాదు. నెంబర్ 5లో అతని రికార్డులను ఒకసారి పరిశీలించండి. అద్భుతమైన రికార్డ్ ఉంది. అతని బ్యాటింగ్ స్థానం గురించి టీమ్‌మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తుందో నాకు అర్థం కావడం లేదు. అతను నెంబర్ 6, 7లో ఆడితే మాత్రం 6, 7 పరుగులే చేసి ఔటవుతాడు.

గంభీర్.. ఇది తప్పు..
హే గంభీర్.. నువ్వు చేస్తున్నది చాలా తప్పు. పరిస్థితులకు తగ్గట్లే అక్షర్ పటేల్‌ను నెంబర్‌ 5లో ఆడిస్తున్నారని నాకు తెలుసు. కానీ ఇది ఏ మాత్రం సరైన వ్యూహం కాదు. ఇలా తరుచూ మార్పులు చేసుకుంటూ పోతే.. కీలక మ్యాచ్‌లో దెబ్బ పడుతోంది. అదే నా భయం. మీ నిర్ణయాలను లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసమని చెబుతూ సమర్థించుకోలేరు. టాప్-4 బ్యాటర్లకు లేని లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌.. నెంబర్ 5 ఆటగాడికి మాత్రమే ఎందుకు? అక్షర్ పటేల్‌తో నాకు ఎలాంటి సమస్య లేదు. అతను అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.

ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం ఎందుకు?
రాహుల్‌ను డౌన్‌ది ఆర్డర్ ఆడించాలనుకుంటే రిషభ్ పంత్‌ను తీసుకోండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరైనదేనా? గంభీర్ నువ్వు చేసిన పనికి పంత్‌ను కూడా పక్కనపెట్టాల్సి వచ్చింది. ఈ ఇద్దరిలో ఒకరు ఆడాలి. మూడో వన్డేలో పంత్ ఆడుతాడని, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతన్నే కొనసాగిస్తారని నాకు అనిపిస్తోంది. రాహుల్ మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో పని లేకుండా అత్యుత్తమ ఆటగాడిని ఐదో స్థానంలో ఆడించండి. ఇదే నా సలహా'అని క్రిష్ శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.

Story first published: Monday, February 10, 2025, 22:16 [IST]
Other articles published on Feb 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+