సీఎస్‌కే ఓటమికి అతనే కారణం.. బౌన్సర్లతో కొంపముంచాడు: క్రిష్ శ్రీకాంత్
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. అన్షూల్ కంబోజ్ చెత్త బౌలింగ్ కారణంగానే లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు. పదే పదే షార్ట్ పిచ్ బాల్స్ వేసి అన్షుల్ కాంబోజ్ మూల్యం చెల్లించుకున్నాడని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ పరాజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. అన్షుల్ కాంబోజ్(0/63) చెత్త బౌలింగ్ చెన్నై పతనాన్ని శాసించింది. ఈ మ్యాచ్‌ను తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విశ్లేషించిన క్రిష్ శ్రీకాంత్.. అన్షుల్ కాంబోజ్ చెత్త బౌలింగ్ ప్రదర్శనతోనే చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైందన్నాడు.

షార్ట్ పిచ్ బాల్స్‌తో మూల్యం..
ముఖ్యంగా మిచెల్ మార్ష్‌కు అన్షుల్ కాంబోజ్ షార్ట్ పిచ్ బాల్స్ వేయడాన్ని శ్రీకాంత్ తప్పుబట్టాడు. వరుసగా సిక్స్‌లు బాదడంతో కాంబోజ్ భయపడిపోయాడని, పదే పదే తప్పు చేస్తూ మూల్యం చెల్లించుకున్నాడని చెప్పాడు.
'అన్షుల్ కాంబోజ్ తొలి బంతినే షార్ట్ బాల్‌గా వేసాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు షార్ట్ బాల్స్ వేస్తే నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తారు. మిచెల్ మార్ష్ తొలి బంతినే కవర్స్ మీదుగా సిక్సర్ బాదాడు. అయినా కూడా కాంబోజ్ బౌన్స్ సాధించడానికి షార్ట్ పిచ్ బాల్స్ వేసాడు. దాంతో రెండో బంతిని మార్ష్.. స్క్వేర్ లెగ్ మీదుగా మరో సిక్సర్ బాదాడు.
సిక్సర్లతో వణికిపోయాడు..
తొలి రెండు సిక్సర్ల తర్వాత కాంబోజ్ భయపడిపోయాడు. మూడో బంతిని స్లో మోషన్‌లో చూస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ భయంతో తప్పిదం మీద తప్పిదం చేశాడు. పదే పదే షార్ట్ పిచ్ బాల్స్ వేస్తూ మూల్యం చెల్లించుకున్నాడు.
వాస్తవానికి సీఎస్‌కే గుడ్ లెంగ్త్, టెస్ట్ మ్యాచ్ లెంగ్త్‌ల్లో బౌలింగ్ చేయాల్సింది. అంతేకాకుండా లెఫ్టార్మ్ పేస్ ద్వయంతో ముందుకు వెళ్లాల్సింది. స్పెన్సర్ జాన్సన్ కేవలం ఆఖరి ఓవర్‌లో మాత్రమే పరుగులు ఇచ్చాడు. కానీ కాంబోజ్ మాత్రం 2.6 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే 16 బంతుల్లో 63 పరుగులు ఇచ్చాడు. ప్రతీ బంతికి నాలుగు పరుగులు సమర్పించుకున్నాడు.
ముఖేష్ చౌదరి మాత్రం 3 ఓవరల్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసాడు. స్పెన్సర్ జాన్సన్, ముఖేష్‌లతో గుడ్ లెంగ్త్స్, టెస్ట్-మ్యాచ్ లెంగ్త్‌ల్లో బౌలింగ్‌ను కొనసాగించాల్సింది.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

