రింకూ సింగ్ హిట్టర్ కాదు.. గాలిగాడు: టీమిండియా మాజీ క్రికెటర్
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌పై భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. రింకూ సింగ్ హిట్టర్ కాదని, గుడ్డిగా ఆడే గాలిగాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ వరుస పరాజయాలతో సమతమతమవుతుంది.
మంగళవారం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో పాయింట్ల ఖాతా తెరిచింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో రింకూ సింగ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.
ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. రింకూ సింగ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎప్పుడో చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టాడని హిట్టర్‌గా పిలవడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

'రింకూ సింగ్ ఏం విధ్వంసకర ఆటగాడు కాదు. ఎప్పుడో పాత రోజుల్లో చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టాడు. దాంతో జనం ఇప్పటికీ అతన్ని ఆకాశానికెత్తుతున్నారు. అతను కేవలం సింగిల్స్, డబుల్స్ తీయడానికి మాత్రమే పనికొస్తాడు. అదీ లక్ష్యం 170 లోపు ఉన్నప్పుడు మాత్రమే. అతన్ని ఐదో స్థానంలో ఆడించడం సరికాదు.
రింకూ సింగ్ ఏ మాత్రం హిట్టర్ కాదు. అతను గుడ్డిగా బ్యాట్ ఊపేస్తున్నాడు. తనకి బౌలింగ్ చేసేవాళ్లంతా 'హల్వా' బౌలర్లు అని అనుకుంటున్నాడా? కేవలం టీ20 ప్రపంచకప్‌లో ఆడినంత మాత్రాన, ఇలా ఇష్టం వచ్చినట్లు బ్యాట్ ఊపేయకూడదు. వచ్చే మ్యాచ్‌లో అతని స్థానంలో కచ్చితంగా టిమ్ సీఫెర్ట్ బరిలోకి దిగుతాడు.'అని శ్రీకాంత్ విమర్శించాడు.
కేకేఆర్ బ్యాటింగ్ విభాగంపై కూడా శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'యంగ్ ప్లేయర్ అంగ్‌క్రిష్ రఘువంశీ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ గెలవాలనే ఉద్దేశంతో ఆడటం లేదు. ముఖ్యంగా ఓపెనర్ ఫిన్ అలెన్ నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకున్నాడు. ఒకే విధమైన బంతికి ప్రతి మ్యాచ్‌లోనూ ఔటవుతున్నాడు.
అతని బ్యాటింగ్‌లో మార్పు రాకపోతే.. అలెన్ స్థానంలో సీఫర్ట్‌కు అవకాశం ఇవ్వాలి. కామెరూన్ గ్రీన్ కోసం వెచ్చించిన రూ.25 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యింది. అతను అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాడు. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కేకేఆర్ ఇంకా గెలుపు ఖాతా తెరవకపోవడం విడ్డూరం.' అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications