ఆసియా కప్ 2025లో టీమిండియా దుమ్మురేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సూపర్ 4 బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా టాప్-4 బ్యాటర్లే మ్యాచ్‌ను పూర్తి చేశారు. లోయర్ మిడిలార్డర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. కానీ వికెట్ కీపర్ సంజూ శాంసన్ స్థానంలో జితేశ్ శర్మను ఆడించాలని టీమిండియా మాజీ క్రికెట్ క్రిష్ శ్రీకాంత్ సూచించాడు. సంజూ కంటే ఫినిషర్‌గా సంజూ శాంసన్ 100 శాతం ఉత్తమమని చెప్పాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'100 శాతం జితేష్ శర్మనే అత్యుత్తమ ఫినిషర్. నా దృష్టిలో సంజూ శాంసన్ టాపార్డర్ బ్యాటర్. సంజూ శాంసన్ అసాధారణమైన ఆటగాడు. కానీ అతను టాపార్డర్‌లో రాణించగలడు. టాప్-3లో బ్యాటింగ్ చేస్తే బౌలర్లను చీల్చిచెండాడుతాడు. కానీ మిడిలార్డర్‌లో నేరుగా వెళ్లి బౌలర్లపై విరుచుకుపడమని చెబితే అతను ఆ పని చేయలేడు. సంజూ శాంసన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే దక్కడం చాలా కష్టం. కేవలం అతన్ని జట్టులో సర్దుబాటు చేశారు అంతే. జితేష్ శర్మ మాత్రమే ఆడాల్సింది. నెంబర్ 6లో సంజూ, హార్దిక్ పాండ్యాలో ఎవరు మెరుగైన బ్యాటర్? అంటే కచ్చితంగా హార్దిక్ పాండ్యానే. కాబట్టి సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశమే లభించదు.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

తాజా టోర్నీలో టీమిండియా స్వింగ్ కింగ్ అర్ష్‌దీప్ సింగ్‌కు అన్యాయం జరుగుతుందని క్రిష్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. 'అర్ష్‌దీప్ సింగ్‌ను చూస్తే బాధగా ఉంది. అతనికి అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతను కొనసాగుతున్నాడు. ఇప్పటికే 99 వికెట్లు తీసాడు. 100 వికెట్ల మైలు రాయి కోసం ఎదురు చూస్తున్నాడు.'అని చెప్పుకొచ్చాడు.