Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బజ్‌బాల్ వర్కౌట్ కాదు.. విమానం ఎక్కేయడం బెటర్: భారత మాజీ క్రికెటర్

ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్ అప్రోచ్‌పై టీమిండియా దిగ్గజ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. టెస్ట్‌ల్లో బజ్‌బాల్ అప్రోచ్ ఎప్పటికీ వర్కౌటవ్వదని చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయకుండా.. ప్రతీ బంతిని బాదుతామంటే కుదురదన్నాడు. భారత్‌‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో శుభారంభం చేసిన ఇంగ్లండ్.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైంది.

రాంచీ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్‌లో విజయం సాధిస్తేనే ఇంగ్లండ్ సిరీస్ రేసులో నిలుస్తోంది. ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌పై స్పందించిన శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'తొలి టెస్ట్‌లో భారత్ ఓడినా.. అద్భుతంగా పుంజుకుంది. ఇంగ్లండ్ మాత్రం ఈ సిరీస్‌లో పుంజుకోలేదు. వారికి విమానం దొరికితే ఇంగ్లండ్ వెళ్లిపోవడం ఉత్తమం.

Kris Srikanth rules out Englands chances of series comeback against India with bazball approach

చివరి రెండు టెస్ట్‌ల్లోనూ బజ్ బాల్ వ్యూహంతో బరిలోకి దిగితే ఇంగ్లండ్‌కు ఓటమి తప్పదు. ఇక బజ్ బాల్ వ్యూహం వారు ప్రచారం చేసినంత అయితే లేదు. యాషెస్‌లోనూ ఫలితం రాలేదు. నిజాయితీగా చెప్పాలంటే టెస్ట్ క్రికెట్‌లో ఈ బజ్‌బాల్ వ్యూహం పనికిరాదు. దూకుడుగా ఆడటం కంటే పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడం నేర్చుకోవాలి.

అలాగే బౌలింగ్ ఎలా చేయాలనేదీ కూడా కీలకం. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బాగానే బ్యాటింగ్ చేసింది. కానీ ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఆడే బ్రెండన్ మెక్‌కల్లమ్, బెన్ స్టోక్స్‌కు మాత్రమే బజ్ బాల్ అప్రోచ్ వర్కౌట్ అవుతుంది. ప్రతీ ఒక్కరు దూకుడుగానే ఆడాలంటే కుదురదు. సహజసిద్దమైన ఆటనే ఆడాలి.'అని కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.

రాజ్‌కోట్ టెస్ట్‌లో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జోరూట్ చెత్త షాట్‌తో మూల్యం చెల్లించుకుంది. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన జో రూట్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జోరూట్ బాధ్యతాయుతంగా, తన సహజ శైలిలో బ్యాటింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది.

Story first published: Wednesday, February 21, 2024, 17:35 [IST]
Other articles published on Feb 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+