పాక్ అభిమానుల గలీజ్ పని.. భారత మహిళా క్రికెటర్‌కు లైంగిక వేధింపులు!
పాకిస్థాన్ అభిమానులు మరోసారి బరి తెగించారు. భారత మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్‌ను లైంగికంగా వేధించారు. ఆమె మహిళ కాదంటూ జుగుప్సాకరమైన రీతిలో కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాక్ అభిమానుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా శనివారం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బౌండరీ లైన్ వద్ద క్రాంతి గౌడ్ ఫీల్డింగ్ చేస్తుండగా.. గ్యాలరీలోని పాకిస్థాన్ అభిమానులు ఆమెపై నోరు పారేసుకున్నారు. క్రాంతి గౌడ్ అమ్మాయి కాదంటూ.. రాయలేని పదాలతో కామెంట్స్ చేశారు.

ఆమె రూపాన్ని ఉద్దేశించి హేళన చేశారు. లడ్కా ఖేల్ రహా హై.. లడ్కా.. ఓయ్ లడ్కే ఇధర్ ఆ.. అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను క్రాంతి గౌడ్ ఏ మాత్రం పట్టించుకోలేదు. వారివైపు కన్నెత్తి కూడా చూడలేదు. పూర్తిగా ఆటలోనే నిమగ్నమైంది.
బొక్కలో వేసి కుమ్మాలి..
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేలి చేసి ఒక్కొక్కడి బొక్కలో వేసి కుమ్మాలని, మళ్లీ ఆడవారిపై కామెంట్స్ చేయకుండా బుద్ది చెప్పాలని కామెంట్ చేస్తున్నారు. దుబాయ్ పోలీసులు వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి సదరు అభిమానులను అదుపులోకి తీసుకోవాలని, అక్కడి చట్టాల ప్రకారం వారి నాలుకలు కోసేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భారత్ అదిరిపోయే ప్రదర్శనతో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆటతోనే పాకిస్థాన్ అభిమానుల నోర్లు మూయించింది.
చిత్తుగా ఓడిన పాకిస్థాన్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మునీబా అలీ( 15 బంతుల్లో ఫోర్‌తో 13), షవాల్ జుఫికర్(14 బంతుల్లో 3 ఫోర్లతో 14) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నలుగురు బ్యాటర్లు ఖాతా తెరవలేకపోయారు. భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి(3/7), ప్రేమ రావత్(3/9) మూడేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. దీప్తి శర్మ(2/5) రెండు వికెట్లు పడగొట్టగా.. షెఫాలీ వర్మ ఒక వికెట్ తీసింది.
అనంతరం భారత్.. 8.4 ఓవర్లలో 3 వికెట్లకు 57 పరుగులు చేసి 68 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. షెఫాలీ వర్మ(6 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 12), ప్రతికా రావల్(3 బంతుల్లో ఫోర్‌తో 4), స్మృతి మంధాన(11 బంతుల్లో 2 ఫోర్లతో 9) విఫలమైనా.. హర్మన్‌ప్రీత్ కౌర్(18 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 18 నాటౌట్), దీప్తి శర్మ(14 బంతుల్లో ఫోర్‌తో 12 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. పాకిస్థాన్ బౌలరల్లో ఫాతిమా సనా(3/17) మూడు వికెట్లు పడగొట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


