Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన కోనేరు హంపి

భారత టాప్ చెస్ ప్లేయర్, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ సెమీఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డుకెక్కింది. జార్జియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఈ తెలుగు అమ్మాయి 1.5-0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌పై విజయం సాధించింది. శనివారం తొలి గేమ్‌లో గెలిచిన హంపి.. ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను డ్రాగా ముగించింది.

తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన కోనేరు హంపి.. యుక్సిన్ సాంగ్‌పై 53 ఎత్తుల్లో విజయం సాధించింది. ఈ గెలుపు తెలుగమ్మాయికి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్ ఓపెనింగ్‌లో లభించిన అడ్వాంటేజ్‌ను వాడుకొని హంపి విజయం సాధించింది.

Koneru Humpy Creates History Becomes First Indian Woman to Reach World Chess Championship Semifinals

రెండో గేమ్‌ను హంపి 53 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. అప్పటికే ఒక పాయింట్‌తో ఆధిక్యంలో ఉండటంతో.. ఈ డ్రా ఆమెను సెమీఫైనల్‌కు చేర్చడానికి కలిసొచ్చింది. సమయ లోపం వల్ల కొన్ని తప్పులు చేసిన హంపి.. వ్యూహాత్మకమైన ఆటతో ముందంజ వేసింది. ఈ గెలుపుతో క్యాండిడేట్స్ టోర్నీ ఆడే అవకాశాలు కోనేరు హంపికి మెరుగుపడ్డాయి. ప్రపంచకప్‌లో టాప్-3లో నిలిచిన ఆటగాళ్లు.. ఈ ఏడాది చివర్లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు.

ఈ ప్రపంచకప్‌లో రౌండ్ 3లో పోలాండ్‌కు చెందిన క్లౌడియా కులోన్‌పై 0-5-1.5 తేడాతో విజయం సాధించిన కోనేరు హంపి..నాలుగో రౌండ్‌లో స్విట్జర్లాండ్ స్టార్ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ను 2.5-1.5 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని టై బ్రేక్ ద్వారా తేల్చాల్సి వచ్చింది.

సెమీఫైనల్లో టాప్ సీడ్ లీ టింజీ(చైనా)తో హంపి అమీతుమీ తేల్చుకోనుంది. టింజీ క్వార్టర్స్‌లో 2-0తో జార్జియా ప్లేయర్ ననా జాగ్నిజె‌ను ఓడించింది. మరోవైపు ఇద్దరు భారత అమ్మాయిలు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్ మధ్య క్వార్టర్స్ ఫలితం సోమవారం టై బ్రేక్స్‌లో తేలనుంది. ఈ ఇద్దరి మధ్య రెండో గేమ్ కూడా డ్రాగా ముగియడంతో ట్రై బ్రేక్స్ తప్పలేదు. వైశాలి టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో ఆమె 0.5-1.5తో తాన్ జ్యోంగి చేతిలో ఓడింది. రెండో గేమ్‌లో వైశాలి ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులు మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు.

Story first published: Monday, July 21, 2025, 9:30 [IST]
Other articles published on Jul 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+