
ఐపీఎల్ 2020కి అలీఖాన్ దూరం
అమెరికా పేసర్ అలీఖాన్ భుజ గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. అయితే ఐపీఎల్ 2020 నుంచి అతడు ఇప్పుడే తప్పుకునే అవకాశం లేదు. ఐపీఎల్ 2020లోని మిగిలిన మ్యాచులకు అలీఖాన్ అందుబాటులో ఉండడు అని కోల్‌కతా జట్టు వర్గాలు చెప్పినా.. అప్పుడే లీగ్ నుంచి తప్పుకోడని సమాచారం. కోల్‌కతా ఆడిన నాలుగు మ్యాచులలో అతడికి చోటు దక్కలేదు. కోల్‌కతా బౌలర్ హ్యారీ గార్నీ భుజం గాయంతో టోర్నీకి దూరం కావడంతో.. అలీఖాన్‌కు అవకాశం దక్కింది. కానీ లాభం లేకుండా పోయింది. అలీఖాన్ ఐపీఎల్ 2020లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చి.. తొందరగానే ఇంటిబాట పట్టే అవకాశం ఉంది.

2016 నుంచి అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం
అలీఖాన్ పుట్టింది పాకిస్థాన్‌లోని పంజాబ్ నగరంలో. 18 ఏళ్ల వరకు అక్కడే ఉన్నాడు. ఆపై కుటుంబంతో సహా అమెరికాలోని ఒహియోకు వెళ్ళిపోయాడు. 2013 నుంచి ఆల్ స్టార్స్ జట్టు కోసం ఆడటం ప్రారంభించాడు. కొన్ని అద్భుత ప్రదర్శనలతో 2016 నుంచి అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కుడి చేతివాటం గల ఈ 29 ఏళ్ల క్రికెటర్ 27.13 సగటుతో 38 వికెట్లు తీశాడు. 2019 ఏప్రిల్‌లో పపువా న్యూగినియా వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. బంతిని వేగంగా వేయడం అలీ ప్రత్యేకత.

12 మ్యాచుల్లో 16 వికెట్లు
2018లో జరిగిన కెనడా గ్లోబల్ టీ20 లీగ్‌లో అలీఖాన్ రాణించాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసి వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో దృష్టిని ఆకర్షించాడు. బ్రావో అండతో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో అడుగుపెట్టాడు. ఆ సంవత్సరం గయానా అమేజాన్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 12 మ్యాచుల్లోనే 16 వికెట్లు తీసి మళ్లీ వార్తల్లో నిలిచాడు. సీజన్‌లోనే రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.

ఒక్క మ్యాచ్ ఆడకుండానే
2019లో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ అలీఖాన్‌ను సొంతం చేసుకుంది. సీపీఎల్ 2020లో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 7.43 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. ట్రిన్‌బాగో టైటిల్ విజేతగా నిలుపడంలో తనవంతు పాత్ర పోషించాడు. సీపీఎల్ ప్రదర్శనతో ఫ్రాంచైజీని విశేషంగా ఆకర్షించాడు. కోల్‌కతా బౌలర్ హ్యారీ గార్నీ భుజం గాయంతో టోర్నీకి దూరం కావడంతో.. యాజమాన్యం వెంటనే అలీఖాన్‌కు అవకాశం కల్పించింది. దీంతో ఐపీఎల్‌లో ఆడుతున్న తొలి అమెరికా ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కానీ ఏం లాభం గాయంతో ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇంటిదారిపట్టనున్నాడు.
MI vs RR: ముంబైతో మ్యాచ్.. స్టీవ్ స్మిత్‌కు రూ.12 లక్షలు జరిమానా!!


Click it and Unblock the Notifications
