న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదు మ్యాచ్‌లు ఒకే వికెట్.. 14 మ్యాచ్‌ల్లో 169 రన్స్!! కోల్‌కతా వదులుకునేది ఈ ఆటగాళ్లనే!

Kolkata Knight Riders might release 5 players ahead of IPL 2021

హైదరాబాద్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 గతవారమే ముగిసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో భారత్‌లోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. జనవరి లేదా ఫిబ్రవరిలో భారీ వేలం జరుగనుంది. ఐపీఎల్ 2020లో ప్రదర్శన ఆధారంగా ఫ్రాంచైజీలు వచ్చే సీజన్‌లో ఏయే ఆటగాళ్లను రిలీజ్ చేయాలి.. ఎవరిని అట్టిపెట్టుకోవాలనే విషయంలో కసరత్తులు మొదలుపెట్టనున్నాయి. ఐపీఎల్ 2020లో ప్లే ఆఫ్ చేరని కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా వచ్చే సీజన్లో కీలక ఆటగాళ్లను మార్చేసే అవకాశం ఉంది. వారి జాబితా ఓసారి పరిశిలిద్దాం.

కుల్దీప్‌ యాదవ్‌:

కుల్దీప్‌ యాదవ్‌:

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కీలక స్పిన్నర్ అయిన కుల్దీప్‌ యాదవ్‌కు గత రెండు సీజన్లలో తగినన్ని అవకాశాలు ఇవ్వలేదు. గత సీజన్లో 9 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీసిన కుల్దీప్.. 2020లో ఐదు మ్యాచ్‌లాడి ఒకే ఒక్క వికెట్ తీశాడు. సునీల్ నరైన్ జట్టులో ఉండడం, వరుణ్ చక్రవర్తి నిలకడగా రాణిస్తుండటంతో.. కుల్దీప్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. వరుణ్ అద్భుతంగా రాణిస్తుండడంతో కోల్‌కతాకు కుల్దీప్‌ అవసరం లేకుండా పోయింది. వాస్తవానికి కుల్దీప్ కూడా గత రెండేళ్లుగా నిలకడైన ప్రదర్శన చెయ్యట్లేదు. దీంతో వచ్చే సీజన్‌కు ముందు కోల్‌కతా అతణ్ని రిలీజ్ చేయొచ్చు.

టిమ్ సీఫెర్ట్:

టిమ్ సీఫెర్ట్:

గాయపడిన హ్యార్నీ గర్నీ స్థానంలో అలీ ఖాన్‌ రీప్లేస్‌మెంట్‌గా వచ్చాడు. అలీ ఖాన్‌ కూడా గాయపడటంతో.. న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ టిమ్ సీఫెర్ట్ జట్టులోకి వచ్చాడు. కానీ జట్టులో గరిష్టంగా 8 మంది మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండగలడం, నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే తుది జట్టులో ఉండాలనే నిబంధన కారణంగా టిమ్ సీఫెర్ట్‌కు వచ్చే సీజన్లో చోటు దక్కకపోవచ్చు. దినేష్ కార్తీక్ బ్యాట్‌తో సగటు ప్రదర్శన చేసినప్పటికీ టిమ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశమే రాలేదు.

క్రిస్ గ్రీన్:

క్రిస్ గ్రీన్:

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ అద్భుత ప్రదర్శనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిస్ గ్రీన్. అంతేకాదు అతను గయానా అమెజాన్ వారియర్స్ కెప్టెన్‌గా కూడా బాగానే రాణించాడు. ఇక ఆల్‌రౌండర్‌గా కోల్‌కతా జట్టులోకి వచ్చిన గ్రీన్.. ఈ సీజన్లో ఒకే మ్యాచ్‌ ఆడాడు. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, ఇయాన్ మోర్గాన్, టామ్ బాంటన్ జట్టులో ఉండటంతో గ్రీన్‌కు ఆడే అవకాశం రాలేదు. వచ్చే సీజన్లో గ్రీన్‌ను కోల్‌కతా రిలీజ్ చేయొచ్చు.

సిద్దేశ్ లాడ్:

సిద్దేశ్ లాడ్:

ఐపీఎల్ 2020కి ముందు ట్రేడ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్ నుంచి సిద్దేశ్ లాడ్‌ను కోల్‌కతా దక్కించుకుంది. శుభ్‌మన్ గిల్‌కు బ్యాకప్‌గా లాడ్‌ను తీసుకున్నారు. ఓపెనర్‌గా సునీల్ నరైన్ విఫలం కాగా.. రాహుల్ త్రిపాఠి, నితిశ్ రాణాలను ఓపెనర్‌గా ఆడించింది. దీంతో లాడ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2020 సీజన్ ముగిసే నాటికి రాణా ఓపెనర్‌గా కుదురుకున్నట్లు కనిపించాడు. టామ్ బాంటన్, త్రిపాఠి కూడా జట్టులో ఉండటంతో లాడ్‌ను కోల్‌కతా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

CSK vs KKR : Ruturaj Gaikwad Wins MS Dhoni's Praise, CSK have A Spark To Hopes For Next Season
దినేశ్ కార్తీక్:

దినేశ్ కార్తీక్:

2018 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా దినేశ్ కార్తీక్‌ను దక్కించుకుంది. గౌతమ్ గంభీర్ నిష్క్రమణతో కార్తీక్‌కు కెప్టెన్సీ అప్పగించింది. గంభీర్ స్థాయిలో కాకున్నా జట్టును అద్భుతంగా ముందుకు నడిపాడు. 2018 సీజన్లో కోల్‌కతాను మూడో స్థానంలో నిలిపాడు. కానీ గత సీజన్లో కొద్ది తేడాలో ఆ జట్టు ప్లేఆఫ్ చేరే ఛాన్స్ మిస్సయ్యింది. ఇక ఈ సీజన్లో కార్తీక్ బ్యాట్‌తోనూ సత్తా చాటాలేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 169 రన్స్ మాత్రమే చేశాడు. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది. అయినా బ్యాట్‌తో సత్తా చాటలేకపోయాడు. దీంతో కార్తీక్‌ను వచ్చే సీజన్‌ ముందు కోల్‌కతా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉన్నా.. విజయం మాదే!! మా జట్టులో కూడా.. : పుజారా

Story first published: Monday, November 16, 2020, 19:37 [IST]
Other articles published on Nov 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X