ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్నా.. విజయం మాదే!! మా జట్టులో కూడా.. : పుజారా

సిడ్నీ: డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్నా.. వారిని కట్టడి చేయడానికి తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా అన్నాడు. ఆస్ట్రేలియా బలంగా ఉన్నా.. విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశాడు. విదేశాల్లో విజయాలు అంత సులువుగా దక్కవని, ఎంతో శ్రమించాలని పుజారా పేర్కొన్నాడు. ఈ పర్యటనలో భారత్, ఆస్ట్రేలియా జట్లు 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనున్నాయి. డిసెంబర్ 17 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా
తాజాగా చెతేశ్వర్ పుజారా మాట్లాడుతూ... 'విదేశాల్లో విజయాలు అంత సులువుగా దక్కవు. ఎంతో శ్రమించాలి. 2018-19తో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ బలంగా మారి ఉండొచ్చు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఉత్తమ ప్లేయర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మా వద్ద అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అంతేకాకుండా వారిలో ఎక్కువ మంది గతంలో ఇక్కడ సత్తాచాటినవారే. ఆస్ట్రేలియాలో ఎలా రాణించాలో వారికి బాగా తెలుసు' అని అన్నాడు.

గులాబీ బంతితో ఆడటం సవాలే
'స్మిత్, వార్నర్, లబుషేన్‌ను ఎలా బోల్తా కొట్టించాలో మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. వాటిని విజయవంతంగా అమలు చేస్తాం. గత పర్యటనలో మాదిరిగా గొప్ప ప్రదర్శన చేస్తే తప్పక సిరీస్‌ను గెలుస్తాం' అని టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ పుజారా తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి డే/నైట్ టెస్టు గురించి పుజారా మాట్లాడుతూ.. గులాబీ బంతితో ఆడటం సవాలు అని.. పేస్, బౌన్స్‌లో మార్పులు వస్తుంటాయని తెలిపాడు. గతంలో ఆసీస్‌పై సమష్టిగా రాణించి విజయం సాధించామని అన్నాడు. టీమిండియా గతేడాది తొలి డే/నైట్ టెస్టు బంగ్లాదేశ్ జట్టుతో ఆడిన విషయం తెలిసిందే.

కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడం భారత్‌కు ప్రతికూలం
2018-19 పర్యటనలో 2-1తో సిరీస్ గెలిచి ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. మూడు సెంచరీలు బాది 500లకు పైగా పరుగులు సాధించాడు. అయితే ఆ సమయంలో వార్నర్, స్మిత్ నిషేధానికి గురై జట్టుకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు వారిద్దరితో పాటు ఫామ్‌లో ఉన్న లబుషేన్ ఆసీస్ జట్టులో ఉండటంతో భారత్ సిరీస్ గెలవడం అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తొలి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడం భారత్‌కు ప్రతికూలంగా మారుతుందని అంటున్నారు.
India vs Australia: టీమిండియాకు శుభవార్త.. టెస్టులకు స్టార్ పేసర్ సిద్ధం!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications