
కోహ్లీ గొప్ప ఆటగాడని మనకి తెలుసు
‘విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని మనందరికీ తెలుసు. టెస్టు సిరీస్‌లో అతడ్ని నిలువరించేందుకు వ్యూహాలు రూపొందించాం. కచ్చితంగా వాటిని మైదానంలో అమలు పరుస్తాం. అయితే.. చాలా మంది ఆస్ట్రేలియా జట్టు కేవలం విరాట్ కోహ్లీపైనే దృష్టి పెడుతోందని.. మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ గురించి ఆలోచించడం లేదని అంటున్నారు. కానీ, అది వాస్తవం కాదు. భారత్ జట్టులోనూ నైపుణ్యమున్న బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. వారిపైనా ఓ కన్నేసి ఉంచాం.'
పార్టీ ప్రచారంలో సెహ్వాగ్?: సిగ్గుండాలి.. ఇంత దిగజారుతారా!!

ఏ భారత స్పిన్నర్.. ఆస్ట్రేలియాలో సత్తాచాటలేదని
'ఇక బౌలింగ్‌లో టీమిండియాకి అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ రూపంలో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. అయితే.. ఏ భారత స్పిన్నర్ కూడా.. స్వదేశంలో రాణించినట్లు ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటలేదని చరిత్ర చెప్తోంది. అయినప్పటికీ.. వారిని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం' అని షాన్ మార్ష్ వెల్లడించాడు.

పెద్ద సంఖ్యలోనే హాజరవుతారని భావిస్తున్నా
ఇరు జట్ల బలాలు సమానంగా ఉన్నాయని భావిస్తున్నాను. కాబట్టి మ్యాచ్ చూసేందుకు భారత్ క్రికెట్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరవుతారని భావిస్తున్నాను. వారందరి ముందు ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. మా అభిమానుల ముందు మా సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాం.

అన్ని రోజులు ఒకేలా ఉండనుండటంతో
ఆఖరుసారిగా అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆడిన మార్ష్ పిచ్ గురించి చెప్పుకొచ్చాడు. అప్పుడు టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. నాలుగో రోజు మైదానం బాగా అనుకూలిస్తుంది. ఈ సమయంలో వికెట్లు తీసేందుకు అనువైన సమయం. మైదానం అన్ని రోజులు ఒకేలా ఉండనుండటంతో ఇరు జట్లకు ఒకే తరహాలో స్పందిస్తుందని తెలిపాడు.


Click it and Unblock the Notifications












