అందుకే సచిన్ పాజీని భుజాలపై ఎత్తుకున్నాం: విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శ్రీలంక పేసర్ నువాన్ కులశేఖర బౌలింగ్‌లో మహేంద్ర్ సింగ్ ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్‌తో యావత్ భారతం ఉప్పొంగింది. ఆ అద్భుత క్షణానా దేశమంతా సంబరం చేసుకుంది. ఇక మైదానంలో భారత ఆటగాళ్ల ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను యువ ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని మైదానమంతా కలియతిరిగారు.
2011 ప్రపంచకప్ విజయానంతరం ముంబైలోని వాంఖడే మైదానంలో కనిపించిన దృశ్యాలివి. ఇక ఈ ప్రపంచకప్ మాట ఎత్తగానే అందరికి గుర్తొచ్చిది ధోనీ సిక్సర్ ఒకటైతే.. సచిన్ భుజాలపై ఎత్తుకోవడం మరొకటి. అయితే నాటి జట్టులో సభ్యుడైన ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్‌ను అలా భుజాలపై ఎత్తుకోవడానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించాడు. 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్'పేరిట యువ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ నిర్వహించిన చాట్‌షోలో కోహ్లీ పలు అంశాలపై మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే ఈ సచిన్ ఎపిక్ మూమెంట్‌ను గుర్తుచేసుకున్నాడు.

గర్వంగా ఉంటుంది..
‘ఆ విజయానంతరం నాకు కలిగిన సంతోషాన్ని వర్ణించలేను. సచిన్‌ను భుజానికెత్తుకున్న ఫొటో ఎప్పుడూ చూసినా సరే గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము వరల్డ్ చాంపియన్స్. ఆ సమయంలో తెలియకుండానే జట్టంతా సచిన్ చుట్టూ చేరింది. ఎందుకంటే అది సచిన్‌కు చివరి వరల్డ్‌కప్ అని మా అందరికీ తెలుసు. పాజీ దేశానికి ఎంతో చేశాడు. అలాంటి వ్యక్తికి మేమిచ్చిన గిఫ్ట్ వరల్డ్‌కప్.

మేమిచ్చిన పెద్ద గిఫ్ట్..
అతను భారత క్రికెట్‌ను 21 ఏళ్లుగా మోసాడు. అందుకే ఆ క్షణాన మేం అతన్ని మా భుజాలపై ఎత్తుకున్నాం. తనదైనా ఆటతో దేశంలోని చాలామంది పిల్లలకు స్పూర్తిదాయకంగా నిలిచాడు. వారందరి తరఫున సచిన్‌కు మేం ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. ఎందుకంటే కొన్నేళ్లుగా సచిన్ భారత్‌కు ఎన్నో ఇచ్చాడు. ఇస్తూనే ఉన్నాడు. తన స్వస్థలంలో సచిన్ కల నెరవేరిందని మేమంతా భావించాం. అందుకే గౌరవ సూచకంగా భుజాలపై ఎత్తుకున్నాం.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

రెండు సార్లు చేజారిన అవకాశం..
ఇక 2011 ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ప్రపంచకప్ గెలిచే అవకాశం రెండు సార్లు చేజారింది. 1996 ప్రపంచకప్‌లో శ్రీలంక చేతిలో భారత్ సెమీస్‌లో ఓడగా.. ఏడేళ్ల తర్వాత 2003 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడింది. ఇక 37 ఏళ్ల వయసులో తన చివరి ప్రపంచకప్‌లో మాత్రం సచిన్ కల నెరవేరింది. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 53.55 సగటుతో సచిన్ 482 రన్స్ చేశాడు. ఇందులో రెండేసి సెంచరీలు, హాఫ్ సెంచరీలున్నాయి. ఇక ఓవరాల్‌గా తన ప్రపంచకప్ కెరీర్‌లో మాస్టర్ 2278 పరుగులు చేశాడు. మరే బ్యాట్స్‌మన్ ఈ ఘనతను అందుకోలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications