న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీతో పోల్చొద్దు.. నేను నేర్చుకుంటున్నా: పంత్

హైదరాబాద్: ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో దూకుడైన ఆటతీరును ప్రదర్శించి.. ప్రశంసలు అందుకుంటున్న యువ క్రికెటర్లలో పంత్ ఒకడు. తన తొలి మ్యాచ్ నుంచే షాట్లు బాదుతూ.. భారీ స్కోరును తెచ్చిపెడుతున్నాడు. టీమిండియాకు భావి క్రికెటర్‌గానే కాకుండా ధోనీ తర్వాత వికెట్ కీపర్‌గా రాణిస్తాడనే నమ్మకంతో అతణ్ని జట్టులోకి తీసుకోగా అతణ్ని ధోనీతో పోలుస్తుండటంపై విమర్శకులకు చురకలు అంటిస్తున్నాడు.

ధోనీతో పోల్చడంపై ఘాటుగా పంత్

ధోనీతో పోల్చడంపై ఘాటుగా పంత్

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో పోల్చడంపై యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘాటుగా స్పందించాడు. ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెస్టు సిరీస్‌తో 5 రోజుల ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన పంత్.. ఆ సిరీస్‌ ఆఖరి టెస్టులో సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. దీంతో ఆ తర్వాత వెస్టిండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ ఎంపికై వరసగా 92, 92 పరుగులతో సత్తాచాటాడు.

 అంచనాల్ని అందుకుంటున్న పంత్..

అంచనాల్ని అందుకుంటున్న పంత్..

అతని ఆట తీరును చూసిన సెలక్టర్లు.. వన్డే, టీ20ల్లోనూ చోటు కల్పించారు. వెస్టిండీస్‌‌‌తో గత వారం ముగిసిన టీ20 సిరీస్‌‌కి, నవంబరు 21 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌‌లోనూ‌‌ ధోనీని తప్పించి మరీ భారత జట్టులో చోటిచ్చారు. అంచనాల్ని అందుకుంటున్న పంత్.. వెస్టిండీస్‌పై ఆఖరి టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాది జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దీంతో.. ఇక జట్టులో ధోనీ స్థానాన్ని పంత్ భర్తీ చేసేశాడంటూ ప్రశంసలతో పాటు పోలికలు తెస్తున్నారు.

 ధోనీతో పోలికలు తేవడంపై విసుగుచెంది

ధోనీతో పోలికలు తేవడంపై విసుగుచెంది

మహేంద్రసింగ్ ధోనీతో తనకి పోలికలు తేవడంపై విసుగుచెందిన పంత్ తాజాగా స్పందించాడు.‘ఎవరితోనో పోటీపడేందుకు నేను భారత జట్టులో లేను. ఇది నా కెరీర్‌లో నేర్చుకునే సమయం. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని.. మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన ప్రమాణాల్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నా' అని ఘాటుగా బదులిచ్చాడు.

 నవంబరు 21 నుంచి జనవరి 18వరకూ

నవంబరు 21 నుంచి జనవరి 18వరకూ

పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై నవంబరు 21 నుంచి 3 టీ20ల సిరీస్‌ ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత డిసెంబరు 6 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. చివరగా జనవరి 18న మూడో వన్డేను ఆడి వన్డే ఫార్మాట్‌ను ముగించుకుంటుంది.

Story first published: Thursday, November 15, 2018, 15:30 [IST]
Other articles published on Nov 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X