For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: సెంచరీ హీరోకు ప్రమోషన్.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!

KL Rahul to lead India in South Africa ODIs if Rohit Sharma misses the series
KL Rahul To Lead Teamindia In ODI Series | IND VS SA 2021 | Oneindia Telugu

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా గడ్డపై అజేయ సెంచరీతో దుమ్మురేపిన టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. తొడ కండరాల గాయం కారణంగా చివరి నిమిషంలో సౌతాఫ్రికా పర్యటనకు పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. అతని గైర్హాజరీలో తాత్కలిక టెస్ట్ వైస్ కెప్టెన్ బాధ్యతలు అందుకున్న కేఎల్ రాహుల్.. వన్డే సిరీస్‌లో భారత జట్టును నడిపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న రోహిత్ శర్మ.. గాయం రికవరీపై స్పష్టత లేదు. వన్డే సిరీస్ వరకు రోహిత్ అందుబాటులోకి వస్తాడని ప్రచారం జరుగుతున్నా.. అతను మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడంపై అనుమానాలు నెలకొన్నాయి.

రోహిత్ అందుబాటులో లేకుంటే..

రోహిత్ అందుబాటులో లేకుంటే..

ఈ క్రమంలోనే రోహిత్ శర్మ దూరమైతే.. అతని స్థానంలో పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు. 'రోహిత్ శర్మ ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. అతని గాయం పురోగతి గురించి స్పష్టమైన సమాచారం లేదు. ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే.. కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తాడు. ప్రస్తుతం రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.'అని సదరు అధికారి తెలిపాడు. మరోవైపు రోహిత్ గాయం నుంచి కోలుకుంటున్నాడని, ఫిట్‌నెస్ నిరూపించుకోవడమే మిగిలిందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

భారీ స్కోర్ దిశగా భారత్..

భారీ స్కోర్ దిశగా భారత్..

మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం మొదలైన తొలి టెస్ట్‌‌లో కేఎల్ రాహుల్(248 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 122 బ్యాటింగ్‌) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా మయాంక్‌ అగర్వాల్‌ (123 బంతుల్లో 9ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించడంతో మొదటి రోజు ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది. రాహుల్‌.. మయాంక్‌తో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కోహ్లీ (94 బంతుల్లో 4ఫోర్లతో 35), అజింక్యా రహానే ( 81 బంతుల్లో 8 ఫోర్లతో 40 బ్యాటింగ్‌)తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పుజారా డకౌటయ్యాడు. భారత్‌ కోల్పోయిన మూడు వికెట్లనూ ఎంగిడి (3/45) పడగొట్టాడు. మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.

 రెండో రోజు వరణుడిదే..

రెండో రోజు వరణుడిదే..

వర్షం కారణంగా రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచి పెట్టుకుపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా మారింది. లంచ్ బ్రేక్ ముగిసినా వరుణుడు కరుణివ్వకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేశారు. మూడో రోజు కొంచెం ముందుగానే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గంటలకే ఆటను ప్రారంభించనున్నారు. అయితే ఒక రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో మ్యాచ్ ఫలితం తేలడం కష్టంగా మారింది. పైగా ఇక సౌతాఫ్రికా వెదర్ ఫోర్ కాస్ట్ ప్రకారం.. మూడు, నాలుగో రోజు వర్షం వచ్చే సూచన లేకున్నా.. చివరి రోజు వర్షం పడే అవకాశం ఉంది. దాంతో వచ్చే రెండు రోజులు ఆట జరిగినా.. ఫలితం తేలడం కష్టం.

సిక్స్ కొట్టాలనుకున్నా..

సిక్స్ కొట్టాలనుకున్నా..

ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన రాహుల్.. తన సెంచరీపై సంతోషం వ్యక్తం చేశాడు.'నేను శతకానికి ఒక పరుగు దూరంలో ఉండగా స్పిన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ లేదా భారీషాట్‌ ఆడాలనుకున్నా. అప్పుడు ఫీల్డర్లంతా సర్కిల్‌లోనే ఉండటంతో భారీ షాట్‌ ఆడుదామని టెంప్ట్‌ అయ్యా. కానీ, దాన్ని విరమించుకున్నా. నేను ఈ ఏడాది లార్డ్స్‌లో శతకం బాదినప్పుడు కూడా ఇలాంటి ఫీలింగే కలిగింది. ఈ రెండు సందర్భాల్లో ఎంతో ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేసిన తీరు నాకే ఆశ్చర్యమేస్తుంది. అయితే, నేను ఆ సింగిల్‌ తీసి సెంచరీ చేయాలని అనుకోలేదు. ఆ ఒక్క బంతిని మాత్రమే అలా భారీ షాట్‌ ఆడాలని అనుకున్నా. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకున్నా. చివరికి మా జట్టును మంచి స్థితిలో నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది' అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, December 27, 2021, 20:33 [IST]
Other articles published on Dec 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+