Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. సౌతాఫ్రికాతో తలపడే భారత వన్డే జట్టు ఇదే!

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ఆదివారం వెల్లడించింది. మెడ నొప్పితో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు దూరంగా కాగా.. కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు దక్కాయి. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వగా.. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా అవకాశం అందుకోగా.. హార్దిక్ పాండ్యా‌ను ఎంపిక చేయలేదు. ఆసియా కప్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. మహమ్మద్ షమీకి సెలెక్టర్లు మరోసారి మొండి చెయ్యే చూపించారు. వన్డే సిరీస్‌కు కూడా అతన్ని పట్టించుకోలేదు.

KL Rahul to Captain India Against South Africa as Ruturaj Gaikwad Returns to the ODI Squad

దేశవాళీతో పాటు భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన రుతురాజ్ గైక్వాడ్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు అవకాశం దక్కగా.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అవకాశం అందుకున్నారు. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్‌ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా అవకాశం అందుకోగా.. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు.

నవంబర్ 30న రాంచీ వేదికగా జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే, డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా మూడో వన్డే జరగనుంది.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.

Story first published: Sunday, November 23, 2025, 18:18 [IST]
Other articles published on Nov 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+