
సీనియర్లకు రెస్ట్..
'తీరికలేని షెడ్యూల్‌తో అలసటకు గురైన సీనియర్ ఆటగాళ్లకు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి దొరకనుంది. జట్టులో కీలక ఆటగాడైన కేఎల్ రాహుల్ టీమ్‌ను నడిపించనున్నాడు. భారత్ వేదికగా జరిగే ఈ సిరీస్‌కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తాం. దానికి తగిన ప్రణాళికలు రచిస్తున్నాం. స్థానిక అధికారులతో మాట్లాడుతున్నాం.'అని సదరు అధికారి తెలిపాడు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే ఈ మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని క్రిక్ బజ్ పేర్కొంది.

బుమ్రా వ్యాఖ్యలతో..
టీ20 ప్రపంచకప్‌లో తమ వైఫల్యానికి తీరిక లేని షెడ్యూల్ కూడా ఓ కారణమని జస్‌ప్రీత్ బుమ్రా తెలిపాడు. న్యూజిలాండ్‌లో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన యార్కర్ల కింగ్.. బయో బబుల్స్‌తో విసిగిపోతున్నామన్నాడు. 'ఆటగాళ్లకు కొన్నిసార్లు విశ్రాంతి అవసరం. కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. ఆరు నెలలుగా విరామం లేకుండా ఆడుతున్నాం. ఇంత సుదీర్ఘ కాలం కుటుంబానికి దూరంగా, బయోబబుల్‌లో ఉండటం వల్ల ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మేమంతా సౌకర్యవంతంగా ఉండేందుకు బీసీసీఐ సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తోంది. ఇది చాలా కష్టసమయం. మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. అందువల్ల ఈ బబుల్‌కు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నాం. మానసిక అలసట కూడా వేధిస్తోంది.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

ఫ్యాన్స్ ఫైర్..
ఇంగ్లండ్ పర్యటన తర్వాత ఐపీఎల్ కోసం నేరుగా యూఏఈకి చేరిన భారత ఆటగాళ్లు.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ కోసం సిద్దమయ్యారు. అయితే బుమ్రా వ్యాఖ్యల నేపథ్యంలో అభిమానులు బీసీసీపై విమర్శలు గుప్పించారు. కాసుల కోసం కక్కుర్తి పడి టీ20 ప్రపంచకప్‌ను బలి ఇచ్చిందని ఘాటుగా విమర్శించారు. మెగా టోర్నీల్లో భారత వైఫల్యానికి కారణమవుతున్న ఐపీఎల్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ట్విటర్ వేదికగా #BANIPL అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

నవంబర్ 17 నుంచి..
ఈ విమర్శలు, ఆటగాళ్ల అలసటను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతివ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ఇక న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా నవంబర్ 17, రాంచిలో నవంబర్ 19, కోల్‌కతా వేదికగా నవంబర్ 21న వరుసగా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత కాన్పూర్ వేదికగా (నవంబర్ 25-29), ముంబై వేదికగా (డిసెంబర్ 3-7) రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది.


Click it and Unblock the Notifications
