Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KL Rahul కళ్లు చెదిరే క్యాచ్.. అచ్చం పక్షిలానే! (వీడియో)

India vs Bangladesh: KL Rahul Catch: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్ డైవ్‌తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు. అచ్చం పక్షిలానే గాల్లో తేలుతూ.. ఒంటి చేత్తో రాహుల్ అందుకున్న ఈ క్యాచ్ అందర్నీ అవాక్కయ్యేలా చేసింది.

ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రాహుల్ కీపింగ్ విన్యాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ అదిరిపోయిందని, టోర్నీ ఆఫ్ ద క్యాచ్ అని కామెంట్ చేస్తున్నారు. రాహుల్ సూపర్ క్యాచ్‌కు మెహ్‌దీ హసన్ మీరాజ్(3) నిరాశగా పెవిలియన్ చేరాడు.

KL Rahul takes spectacular diving catch in India vs Bangladesh World Cup match

మహమ్మద్ సిరాజ్ వేసిన 25వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని సిరాజ్ క్రాస్ సీమ్‌తో లెగ్ స్టంప్ దిశగా వేయగా.. మెహ్‌దీ హసన్ ఫైన్ లెగ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్‌కు ఎడమవైపు దూసుకెళ్లింది. రాహుల్ సూపర్ డైవ్‌తో ఒంటి చేత్తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు.

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తన్జిద్ హసన్(43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51), లిటన్ దాస్(82 బంతుల్లో 7 ఫోర్లతో 66) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించినా.. క్రీజులో సెట్ అయిన తర్వాత చెలరేగారు.

తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించిన అనంతరం తన్జిద్ హసన్‌ను కుల్దీప్ యాదవ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. నజ్ముల్ హోస్సెన్ షాంటో(8)ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే రాహుల్ సూపర్ క్యాచ్‌కు మెహ్‌దీ హసన్(3) వెనుదిరగ్గా.. ధాటిగా ఆడుతున్న లిటన్ దాస్‌ను జడేజా పెవిలియన్ చేర్చాడు. దాంతో బంగ్లాదేశ్ 137 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

Story first published: Thursday, October 19, 2023, 16:34 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+