టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు బంతి తాకరాని చోట తాకింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. సరిగ్గా లంచ్ బ్రేక్‌కు ముందు బెన్ స్టోక్స్ వేసిన బంతి అతని జననాంగానికి బలంగా తాకింది. దాంతో రాహుల్ నొప్పితో విలవిలలాడాడు. క్రీజు నుంచి పక్కకు జరిగి సర్కస్ ఫీట్లు వేసాడు. స్టోక్స్ వేసిన 47వ ఓవర్ ఐదో బంతి.. చాతి హైట్‌లో దూసుకొచ్చింది.
బంతి వేగంగా రావడంతో రాహుల్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. అతని జననాంగానికి బలంగా తాకింది. మరో బాల్ మాత్రమే మిగిలి ఉండటంతో ఫిజియోలను పిలిపించుకోకుండా బలవంతంగా నొప్పితోనే ఆఖరి బంతి ఆడాడు. ఓవర్ ముగిసిన వెంటనే మోకాళ్లపై కూర్చొని నొప్పితో తల్లడిల్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తొలి సెషన్ చివర్ ఓవర్‌ను బషీర్ వేయగా.. రాహుల్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా పంత్ ఆడేసాడు. దాంతో భారత్ 153/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

90/2 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు అతను రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో పంత్‌తో కలిసి రాహుల్ ఆచితూచి ఆడాడు. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ ఉండటం.. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో రాహుల్-పంత్ డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో రాహుల్ 87 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి సెషన్‌లో 24.1 ఓవర్లు ఆడిన భారత్ ఓ వికెట్ కోల్పోయి..63 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.