న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెళ్లితో ఒక్కటయ్యాం.. ఆశీర్వదించండి: కేఎల్ రాహుల్

KL Rahul share first official wedding pics goes viral

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడయ్యాడు. సోమవారం తన ప్రేయసి అతియా శెట్టి మెడలో మూడు ముళ్లు వేసాడు. అతియా శెట్టి తండ్రి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి చెందిన ఫాం హౌస్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి ఫొటోలను రాహుల్-అతియాలు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లైట్ పింక్ కలర్ సంప్రదాయ దుస్తుల్లో ఈ ఇద్దరూ తళక్కుమన్నారు. అతియా చేతిని పట్టుకొని ఉన్న ఫొటోలను రాహుల్ అభిమానులతో పంచుకున్నాడు.

ఈ ఫొటోలకు తమదైన శైలిలో ఓ క్యాప్షన్ ఇచ్చాడు. 'మాకు అత్యంత ఇష్టమైన వారి సమక్షంలో వివాహం చేసుకున్నాం. ఇది మాకు అపారమైన ఆనందాన్ని ఇచ్చింది. మా వివాబంధానికి ప్రేమతో కూడిన మీ ఆశీర్వాదం కావాలి'అని రాసుకొచ్చాడు. సాయంత్రం 4 గంటల సమయంలో రాహుల్-అతియాల వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఇక రాహుల్ కోరిన ఆశీర్వదాన్ని అభిమానులు, మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు అందజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కేఎల్ రాహుల్, అతియా శెట్టి మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. 2019లో మొదలైన వీరి స్నేహం.. ప్రేమగా చిగురించి వివాహ బంధానికి దారి తీసింది. ఆరంభంలో ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టిన ఈ జంట.. ఆ తర్వాత చెట్టాపట్టాలేసుకొని తిరిగింది.

రాహుల్‌తో కలిసి అతియా టీమిండియా పర్యటనలకు కూడా వెళ్లింది. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు మినహా బయటి వ్యక్తులను ఎవరిని ఈ వివాహానికి పిలవలేదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని రాహుల్ జంట ప్రణాళికలు రచిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

Story first published: Monday, January 23, 2023, 21:25 [IST]
Other articles published on Jan 23, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X