For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: ఒక్క బంతికి 14 పరుగులు.. హాఫ్ సెంచరీతో విమర్శకులకు ఇచ్చిపడేసిన కేఎల్ రాహుల్!

KL Rahul Scores 14 Runs In 1 Ball vs Bangladesh In T20 World Cup 2022

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో (4, 9, 9) విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దుమ్మురేపాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌లు విఫలమవడంతో రాహుల్‌ను జట్టు నుంచి తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచించారు. కానీ రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ అతనిపై నమ్మకం ఉంచారు.

ఇక బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆరంభంలో తడబడ్డ రాహుల్.. రెండో ఓవర్‌లో సిక్సర్ బాది టచ్‌లోకి వచ్చాడు. రోహిత్ ఔటైనా.. ఏ మాత్రం జంకని రాహుల్.. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. షోరిఫుల్ ఇస్లామ్ వేసిన 9వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 24 పరుగులు రాబట్టాడు. ఇదే ఓవర్‌లో రాహుల్ ఒకే బంతికి 14 పరుగులు పిండుకున్నాడు. ఇస్లామ్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని రాహుల్.. లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టాడు. అయితే ఆ బంతి నోబాల్ కావడంతో ఫ్రీహిట్ లభించింది. ఒత్తిడికి గురైన ఇస్లామ్ వైడ్ వేయగా.. తర్వాతి బంతిని రాహుల్.. డీప్ పాయింట్ దిశగా మరో సిక్సర్ బాదాడు. దాంతో ఒకే బంతికి 14 పరుగులు వచ్చాయి.

ఆ మరుసటి ఓవర్‌లో క్విక్ డబుల్ తీసిన రాహుల్.. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని విమర్శకులకు ఇచ్చిపడేసాడు. అయితే అదే జోరులో మరుసటి బంతి భారీ షాట్‌కు ప్రయత్నించిన రాహుల్.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే రాహుల్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. అద్భుతంగా ఆడుతోంది. రాహుల్ హాఫ్ సెంచరీకి అండగా కోహ్లీ రాణిస్తుండటంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. క్రీజులో కోహ్లీతో పాటు దినేశ్ కార్తీక్ ఉన్నాడు. 17 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్లకు 150 పరుగులు చేసింది.

Story first published: Wednesday, November 2, 2022, 15:06 [IST]
Other articles published on Nov 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+