ఇది ఊహించిందే.. ఈ విజయ ఉత్సాహంతో టెస్ట్ సిరీస్‌లో చెలరేగుతాం: కేఎల్ రాహుల్

ఛటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో చివరి వన్డేలో తమ జట్టు అసాధారణ ప్రదర్శన ఊహించినదేనని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ విజయ ఉత్సాహాన్ని టెస్ట్ సిరీస్‌లో కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. శనివారం ఏకపక్షంగా సాగిన మూడో వన్డేలో టీమిండియా 227 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210), విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 113) అసాధారణ బ్యాటింగ్‌తో సునాయస విజయాన్నందుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్.. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీలపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఇషాన్‌దార్ ఇన్నింగ్స్..
'మా జట్టు నుంచి ఈ ప్రదర్శన ఊహించినదే. విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ అసాధారణ బ్యాటింగ్‌తో విజయాన్నందించారు. మేం ఆరంభించిన తీరుతో ఈ స్కోర్ చేస్తామనుకోలేదు. కానీ ఇషాన్ అసాధారణ బ్యాటింగ్‌తో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. విరాట్ కూడా తన అనుభవాన్ని ఉపయోగించి ఆడాడు. ఇషాన్‌ను అద్భుతంగా గైడ్ చేశాడు. బ్యాటింగ్ విభాగం చెలరేగితే బౌలర్లు కూడా వికెట్లు తీయగలుగుతారు.

టెస్ట్ సిరీస్‌లోనూ..
అయితే వికెట్ బౌలింగ్‌కు సహకరించకున్నా.. మేం అవకాశాలు సృష్టించుకున్నాం. మా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఓ జట్టుగా మేం నేర్చుకుంటున్నాం. మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. దురదృష్టవశాత్తు తొలి రెండు మ్యాచ్‌ల్లో మాకు అనుగుణంగా ఫలితం సాధించలేకపోయాం. ఈ విజయ ఉత్సాహాన్ని టెస్ట్ సిరీస్‌లో కూడా కొనసాగించాలనుకుంటున్నాం'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

409 పరుగుల భారీ స్కోర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. షకీబ్ అల్ హసన్(43) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు. ఇషాన్ కిషన్ చేసిన 210 పరుగులను కూడా బంగ్లాదేశ్ బ్యాటర్లు చేయలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications