అదే మా కొంపముంచింది.. తడి బంతులతో ప్రాక్టీస్ చేయాలి.. అతను మా బేబీ ఏబీడీ: కేఎల్ రాహుల్

ముంబై: బ్యాటింగ్‌లో శుభారంభం అందుకోకపోవడం, మంచు ప్రభావం తమ ఓటమిని శాసించాయని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌నే విజయం వరించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. అలానే మంచు ప్రభావాన్ని అధిగమించేందుకు తడిబంతులతో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన తమ యువ ప్లేయర్ ఆయుష్ బాదోనిపై ప్రశంసలు జల్లు కురిపించాడు. అతను లక్నో టీమ్ ఏబీడీ అని అభివర్ణించాడు.

షమీ ఒక్కడే..
'ఇదో అసాధారణమైన మ్యాచ్. మేం శుభారంభం అందుకోలేదు. కానీ అద్భుతంగా పుంజుకున్నాం. వాంఖడే మైదానంలో ఆరంభంలో బంతి బౌలర్లకు అనుకూలిస్తుందనే విషయం మాకు తెలుసు. ఇక మేం ఆశించిన రీతిలో మా ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించలేదు. విజయంతో మొదలుపెడితే గొప్పగా ఉండేది. కానీ ఈ ఓటమితో అనే విషయాలు నేర్చుకున్నాం. ఈ పిచ్‌ను సరిగ్గా ఉపయోగించుకుంది మహమ్మద్ షమీ ఒక్కడే. పంజాబ్ తరఫున అతనితో కలిసి మూడు, నాలుగేళ్లు ఆడాను. అతను ఎంత డేంజరస్ బౌలరో నాకు బాగా తెలుసు.
మా బేబీ ఏబీడి..
ఈ మ్యాచ్‌లో బంతితో రాణించి 15వ ఓవర్ వరకు మా విజయవకాశాలను కాపాడుకున్నాం. కానీ విపరీతమైన మంచు కారణంగా విజయం సాధ్యమవ్వలేదు. ఈ గెలుపు క్రెడిట్ రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్‌లదే. ఇక ఆయుష బాదోని మా జట్టు బేబీ ఏబీడీ. అరంగేట్ర మ్యాచ్‌లోనే నమ్మశక్యం కానీ రీతిలో ఆడాడు. అతను బంతిని 360 డిగ్రీస్ ఆడగలడు.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

షమీ తీన్మార్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ ఆయూష్ బాదోని(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54), దీపక్ హుడా(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో రాణించగా... కృనాల్ పాండ్యా(13 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా..ఆరోన్ ఫించ్ రెండు, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

తెవాటియా మెరుపులు..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలోనే 5 వికెట్లకు 161 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రాహుల్ తేవాటియా(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) కడవరకు క్రీజులో నిల్చొని విజయంలో కీలక పాత్ర పోషించాడు. మాథ్యూవేడ్(29 బంతుల్లో 4 ఫోర్లతో 30), హార్దిక్ పాండ్యా(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33), డేవిడ్ మిల్లర్(21 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో చమీరా రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా తలో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications