స్వేచ్ఛ కోసం లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడానని చెప్పిన ఆ జట్టు మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తన హోమ్ టీమ్‌లోకి పునరాగమనం చేయాలనుందనే తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరఫునే స్వేచ్ఛగా, సంతోషంగా ఆడానని చెప్పాడు.
ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌బై చెప్పిన కేఎల్ రాహుల్.. మెగా వేలం బరిలోకి దిగాడు. ఇప్పటికే అతన్ని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. వేలంలో కొనుగోలు చేస్తామనే హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఆ జట్టుతో ఆడటం మరిచిపోలేను..
ఆర్‌సీబీ తరఫున ఆడిన రోజులు మరిచిపోలేనివని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2016 ఫైనల్లో ఎదురైన ఓటమిని ఇప్పటికీ మరిచిపోమని, గత 5, 6 ఏళ్లలో ఈ ఓటమి గురించి విరాట్ కోహ్లీ తాను చాలా సార్లు మాట్లాడుకున్నామని తెలిపాడు. 'కొత్తగా మొదలు పెట్టాలనుకున్నా. కొత్త అవకాశాలను అన్వేషించాలని భావించా. నాకు స్వేచ్ఛ దొరికే దగ్గర ఆడాలని కోరుకున్నా.
కొన్నిసార్లు దూరంగా వెళ్తే మనకు కావాల్సింది దక్కుతుంది. జట్టు వాతావరణ తేలికగా ఉంటుంది. కొంతకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నా. ఆటగాడి నా సామర్థ్యమేమితో నాకు బాగా తెలుసు. మునపటిలా సత్తా చాటడానికి ఏం చేయాలో కూడా తెలుసు. ఈ ఐపీఎల్ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం.
ఆ మ్యాచ్ గెలవాల్సింది..
2016లో నేను ఆర్‌సీబీలోకి తిరిగి వెళ్లడం ఓ అద్భుతమైన కథ. ఆర్‌సీబీ తరఫున నా ఆటను చాలా ఆస్వాదించాను. బెంగళూరు నా హోమ్ టౌన్. నేను కన్నడ కుర్రాడినని అక్కడి ప్రజలకు బాగా తెలుసు. దురదృష్టవశాత్తు క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన అన్నిసార్లు సరిపోదు. పుంజుకునేందుకు నేను చాలా కష్టపడేవాడిని. నా ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి నేను ఓ మార్గాన్ని కనుగొంటాను. జట్టులో ఎలాంటి పాత్ర ఇచ్చినా.. బాధ్యతకైనా సిద్దంగా ఉన్నాను.
గత ఐదు, ఆరు ఏళ్లలో నేను, విరాట్ కోహ్లీ చాలా సార్లు ఐపీఎల్ 2016 ఫైనల్ గురించి మాట్లాడుకున్నాం. ఆ మ్యాచ్‌లో మా ఇద్దరిలో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను ముగించాల్సింది. ఆ ఏడాది మాకు చాలా ప్రత్యేకమైనది. ఆ మ్యాచ్ గెలిచి టైటిల్ అందుకొని ఉంటే ఓ మంచి క్షణంగా నిలిచిపోయేదు. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.