
ఆ బంతిని చూడలేదు..
'బౌల్ట్ వేసిన ఆ బంతిని చూడలేదు. నేను చూసుంటే ఏదో ఒకటి చేసేవాడిని. కానీ అదో అద్భుతమైన బంతి. మాది మంచి టీమ్. బౌలింగ్, బ్యాటింగ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. మాకు గెలిచే అవకాశాలున్నాయని తెలుసు. కానీ ఈ రోజు మేం ఒక్క మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాం. అయినా మ్యాచ్ చివరి వరకు వెళ్లడం అద్భుతం. మార్కస్ స్టోయినిస్ తన తొలి మ్యాచ్‌లోనే అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.

టీమ్ ప్లాన్ ప్రకారమే..
స్టోయినీస్‌ను లోయారార్డర్‌లో ఆడించడం టీమ్ ప్రణాళికనే. అతను ఎంత ప్రమాదకర బ్యాట్స్‌మనో.. చివరి ఐదు ఓవర్లలో ఎలా చెలరేగుతాడో మాకు తెలుసు. మా జట్టులో చాలా మంది ఆల్‌రౌండర్లున్నారు. కాబట్టి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే మేం బ్యాటింగ్ ఆర్డర్‌ను మారుస్తాం. ఏ మాత్రం ఊహించని పనులు చేస్తాం. ఇలాంటి సాధారణ లక్ష్యాలు ఎప్పుడు క్లిష్టమే. ఇక బౌలర్లు ప్రణాళిక పరంగా బౌలింగ్ చేయలేకపోయారు.

ఆ తప్పు చేస్తే..
లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయాలనేది వ్యూహం. కానీ అది చేయలేకపోయాం. ముఖ్యంగా చివర్లో యార్కర్లను సంధించలేక భారీగా పరుగులు ఇచ్చుకున్నాం. ఈ రోజుల్లో ప్రణాళికల ప్రకారం బౌలింగ్ చేయకుంటే బ్యాటర్స్ ట్రబుల్ చేస్తారు. మేం మరింత కష్టపడి, ఒత్తిడిని అధిగమించడం ఎలానో నేర్చుకుంటాం. ఒక్క బ్యాడ్ గేమ్‌తో పరిస్థితులన్నీ తలకిందులవ్వవు. ఇది మాకో గుణపాఠం.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

చాహల్ మ్యాజిక్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్‌మైర్(36 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లతో 29), రవిచంద్రన్ అశ్విన్(23 బంతుల్లో 2 సిక్స్‌లతో 28) రాణించారు. లక్నో బౌలర్లలో జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీసారు. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. మార్కస్ స్టోయినీస్, క్వింటన్ డికాక్(32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 39)టాప్ స్కోరర్లుగా నిలవగా.. దీపక్ హుడా(24 బంతుల్లో 3 ఫోర్లతో 25), కృనాల్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లతో 22) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో సత్తా చాటగా.. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్, కుల్దీప్ సేన్‌కు తలో వికెట్ దక్కింది.


Click it and Unblock the Notifications
