నేనొక్కడినే కాదు.. జట్టులో ప్రతీ ఒక్కడు ఇబ్బంది పడుతున్నాడు: కేఎల్ రాహుల్

మొహాలీ: తన స్ట్రైక్‌రేట్ గురించి వస్తున్న విమర్శలపై టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్ట్రైక్‌రేట్ విషయంలో తానొక్కడినే ఇబ్బంది పడటం లేదని, జట్టులో ఉన్న ఆటగాళ్లంతా సతమతవుతున్నారని తెలిపాడు. ఈ విషయంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా మంగళవారం తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాహుల్‌ను నెమ్మదిగా ఆడటంపై ప్రశ్నించగా.. ఈ వ్యాఖ్యలు చేశాడు.

నేనొక్కడినే కాదు.
.
'స్ట్రైక్ రేట్ జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరు మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఈ విషయంలో ఎవరూ పరిపూర్ణులు కాదు.డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఉండే ఉంటారు. అయితే స్ట్రైక్ రేట్ అనేది కొన్ని మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని గణించేది కాదు. ఒక బ్యాటర్ ఎప్పుడూ ఒకే స్ట్రైక్ రేట్‌తో ఆడటం కష్టం. ఒక ఆటగాడు 200 స్ట్రైక్ రేట్‌తో ఆడాలా? లేక 100-120తో ఆడాలా? అనేది ఎప్పుడూ విశ్లేషించడం కుదరదు. మొత్తంగా చూసుకుంటే స్ట్రైక్ రేట్ ఎలా ఉందనేది ముఖ్యం.

ప్రత్యేక దృష్టి పెట్టా..
అయినా సరే.. నేను నా స్ట్రైక్ రేట్ మీద వర్క్ చేస్తున్నాను. టీ20 ప్రపంచకప్ కోసం గత 10-12 నెలలుగా జట్టులో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంది. అందుకోసమే అందరూ కృషి చేస్తున్నారు. జట్టు తమ నుంచి ఏం కోరుకుంటుందనేదానిపై అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే నేను కూడా జట్టుకు ఏ విధంగా ఉపయోగపడాలన్న దానిమీద.. నన్ను నేను మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నా.' అని తెలిపాడు.

నెమ్మదిగా ఆడటంతో..
ఐపీఎల్‌లో ప్రారంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌లో క్రీజులో నిల్చొనేందుకే ఇబ్బందులు పడ్డాడు. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. పవర్ ప్లేలో ఒకవైపు రోహిత్ శర్మ రెచ్చిపోతుంటే కేఎల్ రాహుల్ మాత్రం మరీ నెమ్మదిగా ఆడుతున్నాడని విమర్శలు ఎదుర్కున్నాడు. ఆసియా కప్‌లో రాహుల్ అనుకున్న రీతిలో రాణించకపోయినా టీ20ల్లో అతని స్ట్రైక్ రేట్ ఫర్వాలేదు. 61 మ్యాచ్‌ల్లో రాహుల్ స్ట్రైక్ రేట్ 140 ప్లస్ గానే ఉంది. కానీ ఆఖరి పది ఇన్నింగ్స్‌ల్లో మాత్రం అది నెమ్మదిగా తగ్గుతూ వస్తుండటంతో రాహుల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications