Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇంటర్వ్యూ భయపెట్టింది.. ఓ మచ్చలా మిగిలిపోయింది: కేఎల్ రాహుల్

'కాఫీ విత్ కరణ్'షో‌ ఇంటర్వ్యూ తనను తీవ్రంగా భయపెట్టిందని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. తన జీవితంలోనే ఈ ఇంటర్వ్యూ ఓ మాయని మచ్చలా మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు. నాలుగేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించే 'కాఫీ విత్ కరణ్'షో‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ పాల్గొన్నాడు.

ఈ షోలో కరణ్ జోహర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానంగా రాహుల్, హార్దిక్ పాండ్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి మహిళలను కించపర్చేలా ఉండటంతో తీవ్ర దుమారం రేగింది. సర్వత్రా విమర్శలు రావడంతో ఈ ఇద్దరిని జట్టు నుంచి సస్పెండ్ చేస్తూ బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. క్షమాపణలు చెప్పడంతో నిషేధం ఎత్తేసింది.

KL Rahul says Koffee With Karan Controversy scarred me massively

నా జీవితమే మారిపోయింది..
ఈ వివాదంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న రాహుల్ తాజా స్పందించాడు. ఆ ఇంటర్వ్యూతో తన జీవితమే మారిపోయిందని, ఆ వివాదం తనను ఎంతో భయపెట్టిందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఎల్ రాహుల్ ఈ వివాదం గురించి మాట్లాడాడు. 'సాధారణంగా ట్రోలింగ్‌ను నేను పెద్దగా పట్టించుకోను. కానీ, కొన్నేళ్ల క్రితం నాపై విపరీతమైన ట్రోలింగ్‌ జరగడంతో పాటు విమర్శలు వచ్చాయి.

నేను కూర్చున్నా.. నిల్చున్నా ట్రోల్ చేశారు. కాఫీ విత్ కరణ్ షో వ్యక్తిగతం నా జీవితాన్ని మార్చేసింది. నన్ను ఎంతగానో భయపెట్టింది. సాధారణంగా నేను మృదుస్వభావం కలిగిన వ్యక్తిని. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన తర్వాత నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.

తీవ్రంగా భయపెట్టింది..
100 మంది మధ్యలో ఉన్నా మాట్లాడగలిగేవాణ్ని. కానీ, ఇప్పుడు అలా చేయలేకపోతున్నా. ఆ ఇంటర్వ్యూ కారణంగా నెలకొన్న వివాదంతో పబ్లిక్‌గా మాట్లాడాలంటేనే భయమేస్తోంది. స్కూల్లో నన్నెప్పుడూ సస్పెండ్ చేయలేదు. కఠినంగా శిక్షించలేదు. కానీ ఆ వ్యాఖ్యల తర్వాత జట్టులో సస్పెన్షన్‌కు గురయ్యా. తొలిసారి అలాంటి అనుభవం ఎదురవడంతో ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. ఇప్పటికీ నా జీవితంలో అది మాయని మచ్చలా మిగిలిపోయింది.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

2019లో జరిగిన ఈ ఇంటర్వ్యూలో.. రాహుల్ తన జేబులో కండోమ్ ప్యాకెట్లు ఉంచుకునేవాడినని అసభ్యకరంగా మాట్లాడాడు. తన తండ్రికి ఓసారి దొరికిపోగా.. ఫర్వాలేదు సేప్టీ వాడుతున్నావని కితాబిచ్చినట్లు షోలో వెల్లడించాడు. యువతకి స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్లు ఇలా నోరుజారడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రాగా .. రాహుల్, హార్దిక్‌పై బీసీసీఐ కొన్ని రోజులు నిషేధం విధించింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌ను కూడా తొలగించారు.

Story first published: Saturday, August 24, 2024, 18:11 [IST]
Other articles published on Aug 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+