KL Rahul, IND vs NED: ఇన్నింగ్స్ చివర్లో సిక్స్‌లు బాదడం రాకెట్ సైన్స్ ఏం కాదని టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. కాస్త కష్టపడితే కష్టంగా ఉన్నా సిక్స్‌లు బాదొచ్చని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్.. ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది సెంచరీ సాధించాడు.
62 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని ప్రపంచకప్‌లోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును అధిగమించాడు. ఇన్నింగ్స్ అనంతరం తన బ్యాటింగ్‌పై స్పందించిన కేఎల్ రాహుల్.. కీలక సెమీస్ ముందు శతకం బాదడం సంతోషంగా ఉందని చెప్పాడు.

'గత రెండు మ్యాచ్‌ల్లో మిడిల్ ఓవర్లలో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో కావాల్సినంత సమయం లభించింది. నెంబర్ 5లో ఆడే బ్యాటర్‌కు ఆత్మవిశ్వాసం ఉండటం చాలా ముఖ్యం. నేను ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ఇది. చివర్లో సిక్స్‌లు కొట్టాలంటే మనపై మనకు నమ్మకం కలగడం చాలా ముఖ్యం. ఇది రాకెట్ సైన్ ఏం కాదు.
చివరి 10 ఓవర్లలో కాస్త కష్టపడితే సిక్స్‌లు కొట్టవచ్చు. వేగంగా ఆడుతూ వీలైనన్ని పరుగులు చేసేందుకు ప్రయత్నించాలి. అదే మా ప్రణాళిక. బంతి తేలికగా మారడంతో సిక్స్‌లు బాదడం కష్టంగా మారింది. ప్రతీ ఒక్కరికి గేమ్ ప్లాన్‌పై క్లారిటీ ఉంది. మా ప్రణాళికలను మేం పకడ్బందీగా అమలు చేస్తున్నాం.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌కు మరింత ఉత్సహంగా సిద్దమవుతాం. కీపింగ్ చేయడం కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. కానీ ఈ బాధ్యతను నేను ఆస్వాదిస్తున్నాను. డీఆర్‌ఎస్ నిర్ణయాల్లో బౌలర్లు నన్ను సవాల్ చేస్తున్నారు. కానీ అనుకూల ఫలితాల్లో మాత్రం నాకు క్రెడిట్ ఇవ్వడం లేదు.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 128 నాటౌట్), కేఎల్ రాహుల్(64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102) విధ్వంసకర శతకాలతో చెలరేగగా.. రోహిత్ శర్మ(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), శుభ్‌మన్ గిల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.