Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KL Rahul: భారత జట్టులో మార్పులు అవసరం.. కెప్టెన్‌గా రాణిస్తా.. నన్ను నమ్మండి!

 KL Rahul says Indias white-ball cricket needs urgent transformation
Captain Poor KL Rahul Utterly Disappointed With Teamindia Show | Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో మార్పులు అవసరమని తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ అభిప్రాయపడ్డాడు. గత నాలుగైదేళ్లుగా భారత జట్టు మెరుగ్గా రాణించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టీమ్ కాంబినేషన్‌లో మార్పులు చేయాలన్నాడు. సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో భారత్ చిత్తుగా ఓడటంపై స్పందించిన రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరీస్ కోల్పోయినా కెప్టెన్‌గా రాణించగలననే నమ్మకం ఉందన్నాడు. ఈ ఓటమితో చాలా నేర్చుకున్నానని తెలిపిన రాహుల్.. విజయాల కంటే ఓటములే మెరుగ్గా తయారు చేస్తాయన్నాడు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

టీమ్ మార్చాలి..

టీమ్ మార్చాలి..

‘టీమిండియాకు సారథ్యం వహించాలనే నా కల సాకారమైంది. ఇంతకు మించిన గౌరవం లేదు. సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమి నుంచి మేం చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం 2023 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆడుతున్నాం. దానికి అనుగుణంగా మెరుగైన జట్టును సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాం. గత నాలుగైదు ఏళ్లుగా మేం మెరుగ్గానే రాణిస్తున్నాం. అయినా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జట్టులో మార్పులు అవసరం.

సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయానికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలనుకోవట్లేదు. కానీ, జట్టుగా మేము ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.

 కెప్టెన్‌గా రాణిస్తా..

కెప్టెన్‌గా రాణిస్తా..

జట్టుకు నాయకత్వం వహిస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను. విజయాల కంటే మనకు ఎదురైన పరాజయాలే మనల్ని మెరుగ్గా తయారు చేస్తాయి. నా కెరీర్‌ మొత్తం అలాగే సాగింది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. నాకు ఆ విశ్వాసం ఉంది. జట్టు సభ్యుల నుంచి అత్యుత్తమ ఆటతీరును రాబట్టేందుకు కృషి చేస్తాను. ఐపీఎల్‌లో అయినా, భారత జట్టుకు సారథ్యం వహించినా మెరుగ్గా రాణించగలనన్న నమ్మకం ఉంది' అని కేఎల్‌ రాహుల్ చెప్పుకొచ్చాడు.

రాహుల్ అట్టర్ ఫ్లాఫ్..

రాహుల్ అట్టర్ ఫ్లాఫ్..

రెగ్యులర్‌ కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమవడంతో కేఎల్ రాహుల్ తాత్కలిక కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్‌గా రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ప్రత్యర్థి జోరు ముందు తీవ్ర ఒత్తిడికి గురైన రాహుల్.. మైదానంలో చురుకుగా వ్యవహరించలేకపోయాడు. ఆ ఒత్తిడిలోనే బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో టీమ్ఇండియా ఒక్క మ్యచులో కూడా విజయం సాధించకపోవడంతో రాహుల్ నాయకత్వ పటిమపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గోల్డెన్ చాన్స్ మిస్..

గోల్డెన్ చాన్స్ మిస్..

దాంతో భారత్ కెప్టెన్‌గా ఎంపికయ్యే సువర్ణవకాశాన్ని రాహుల్ చేజార్చుకున్నాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఫ్యూచర్‌లో టీమిండియా లీడర్ అవుతాడని అనుకున్న అందరినీ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. మిడిల్ ఓవర్లలో అతని బౌలింగ్ మార్పులు వర్కౌట్ కాలేదు. అదే టైమ్‌లో సాఫారీ కెప్టెన్ టెంబా బవుమా ప్లానింగ్ సూపర్‌గా ఉంది. రోహిత్ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాహుల్‌ను టెస్ట్ కెప్టెన్ చేసారా? అని బీసీసీఐ సీనియర్ అధికారిని ప్రశ్నించగా.. ‘అసలు ఏ టైమ్‌లో అయిన రాహుల్ మీకు కెప్టెన్‌గా కనిపించడా?'అని ఆయన ఎదురు ప్రశ్నించాడు.

Story first published: Tuesday, January 25, 2022, 13:13 [IST]
Other articles published on Jan 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+