Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs LSG: మాటల్లేవ్.. ఈ విధ్వంసం నేను ఏడా చూడలే: కేఎల్ రాహుల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో తనకు మాటలు రావడం లేదని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ తరహా బ్యాటింగ్ తాము టీవీలోనే చూశామని, లైవ్‌లో చూడటం ఇదే తొలిసారని చెప్పాడు. ఇది నమ్మశక్యం గానీ బ్యాటింగ్ అని కొనియాడాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కేఎల్ రాహుల్.. సన్‌రైజర్స్ విధ్వంసం ముందు తమ జట్టు తేలిపోయిందని తెలిపాడు.

KL Rahul says I m lost for words this is unreal batting after SRH beat LSG in IPL 2024

'అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఈ తరహా బ్యాటింగ్‌కు మేం టీవీలోనే చూశాం. కానీ ప్రత్యక్ష్యంగా చూడటం ఇదే తొలిసారి. ఇది నమ్మశక్యంగానీ బ్యాటింగ్. ప్రతీ బంతిని బ్యాట్‌ను మిడిల్ చేస్తున్నారు. వారి నైపుణ్యానికి నా సలామ్. సిక్స్‌లు బాదే సామర్థ్యాన్ని పెంచుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సెకండ్ ఇన్నింగ్స్ పిచ్ ఎలా ఉందనే ఆలోచన కూడా చేయకుండా చేశారు.

వారిని ఆపడం మా వల్ల కాలేదు. బంతిని ఎలా వేసినా బౌండరీకి తరలించారు. ఓటమిపాలైనప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ మ్యాచ్‌లో మేం 40-50 పరుగులు తక్కువగా చేశాం. పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడి పోరాడే లక్ష్యాన్ని అందించారు. కానీ మేం 240 పరుగులు చేసినా చేధించేలా బ్యాటింగ్ చేశారు.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోని(30 బంతుల్లో 9 ఫోర్లతో 55), నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించారు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 29), కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) పరిస్థితులకు తగ్గట్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/12) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ల సంచలన బ్యాటింగ్‌తో 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

Story first published: Wednesday, May 8, 2024, 23:24 [IST]
Other articles published on May 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+