ఏమో సార్ నాకు కూడా తెలియదు: కేఎల్ రాహుల్

ఛటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను కాదని వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్సీగా నియమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మాములగా రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తే.. రిషభ్ పంత్ వైస్ కెప్టెన్సీ చేసేవాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రోహిత్, రాహుల్ గైర్హాజరీలో జస్‌ప్రీత్ బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పినప్పుడు కూడా పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ బంగ్లాదేశ్‌తో రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏమో సార్.. తెలియదు..
రిషభ్ పంత్‌పై సెలెక్టర్లకు నమ్మకం సన్నగిల్లిందని, జట్టులో అతనికి రోజులు దగ్గరపడ్డాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందు ఉంచగా.. తనకు ఏం తెలియదని చెప్పాడు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్ నేపథ్యంలో రాహుల్.. సోమవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటని రిపోర్టులు ప్రశ్నించారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న క్రిటేరియా ఏంటో తనకు కూడా తెలియదని రాహుల్ సమాధానమిచ్చాడు.

వైస్ కెప్టెన్సీతో వచ్చే కిరీటం ఏం లేదు..
'పంత్‌ను కాదని పుజారాను వైస్ కెప్టెన్‌గా ఎంపికచేయడం వెనుక ఉన్న క్రిటేరియా ఏంటో నాకు కూడా తెలియదు. ఎవర్నీ ఎంపిక చేసినా మన ఆట మనం ఆడాల్సిందే. నేను కెప్టెన్ అయినా జట్టులో నా బాధ్యత నేను నిర్వర్తించాలి. ఈ బాధ్యతలతో మారేది ఏం ఉండదు. జట్టులోని ప్రతీ ఒక్కరికి వారి పాత్ర, బాధ్యత తెలుసు. జట్టు విజయాన్ని ప్రతీ ఒక్కరి సహకారం కావాల్సిందే. రిషభ్ పంత్, పుజారా అద్భుతమైన ఆటగాళ్లు. చాలా సార్లు వారి సత్తా ఏంటో నిరూపించుకున్నారు. దీని గురించి మేం పెద్దగా ఆలోచించడం లేదు. జట్టుగా రాణించడంపైనే ఫోకస్ పెట్టాం'అని రాహుల్ తెలిపాడు.

ఇక నుంచి దంచి కొట్టుడే..
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం లోటేనని రాహుల్ తెలిపాడు. అతన్ని జట్టు చాలా మిస్సవుతుందని పేర్కొన్నాడు. రెండో టెస్ట్‌కు అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ అసాధారణ ఆటగాడని ప్రశంసించిన రాహుల్..
ఆటపట్ల అతని కమిట్‌మెంట్, ప్యాషన్, అటిట్యూడ్ అద్భుతమని కొనియాడాడు. ప్రస్తుతం విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతాడని జోస్యం చెప్పాడు. భారత్ తరఫున ఎన్నో ఏళ్లుగా నిలకడగా ఆడుతున్న కోహ్లీ.. బంగ్లాతోనూ అదే జోరు కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా భారత జట్టు నుంచి దూకుడైన ఆట చూస్తారని కచ్చితంగా చెప్పగలనని రాహుల్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications