For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆ కెప్టెన్సీ త్రయం నుంచి ఎన్నో నాయకత్వ పాఠాలు నేర్చుకున్నా.. అవి ఇప్పుడు అమలు చేస్తా'

KL Rahul Says Have picked up leadership traits from Virat Kohli, MS Dhoni and Rohit Sharma

దుబాయ్: ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకుంటానని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఆ కెప్టెన్సీ త్రయం నుంచి నేర్చుకున్న నాయకత్వ పాఠాలను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో అమలు చేస్తానని చెప్పాడు. ఎంతో అనుభవజ్ఞుడైన టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్‌ కుంబ్లే.. పంజాబ్ కోచ్‌గా తన పక్కనుండటం ఆనందంగా ఉందని రాహుల్‌ వెల్లడించాడు.ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19న ప్రారభవనున్న విషయం తెలిసిందే.

ఆ త్రయం నుంచి ఎన్నో నేర్చుకున్నా

ఆ త్రయం నుంచి ఎన్నో నేర్చుకున్నా

తాజాగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్ మాట్లాడుతూ.... 'ధోనీ, కోహ్లీ, రోహిత్ ‌పదేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు. వారి నేతృత్వంలోనే ఆడే అవకాశం నాకు దక్కింది. ధోనీ భాయ్ గురించి చెప్పేదేముంటుంది. మహీ గురించి క్రికెట్ ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే కోహ్లీ, ధోనీ వ్యక్తిగతంగా పూర్తిగా భిన్నం. జట్టును నడిపించడంలో అభిరుచి మాత్రం ఒకేలా ఉంటుంది. అయితే వారి పద్ధతులు మాత్రమే వేరు. జట్టును గెలిపించాలని ఇద్దరు ఎప్పుడూ కోరుకుంటారు. ఆటగాళ్లకు మద్దతుగా ఉంటారు' అని అన్నాడు.

వారి విధానాలనే నేను అనుసరిస్తా

వారి విధానాలనే నేను అనుసరిస్తా

'ఇక రోహిత్ శర్మ ఎలాంటి నాయకుడో మనందరికీ తెలిసిందే. చాలా కూల్ అండ్ కామ్. కేన్‌ విలియమ్సన్‌ వంటి ప్రత్యర్థి కెప్టెన్ల నుంచీ ఎంతో నేర్చుకోవచ్చు. వారి విధానాలనే నేను అనుసరిస్తా. ఎప్పుడూ మైదానంలో ఆటను నిరంతరం పరిశీలిస్తూనే ఉంటా. నిత్యం ఏదోఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా' అని స్టైలిష్ ఓపెనర్ లోకేష్ రాహుల్ అన్నాడు. రాహుల్ గత రెండు సంవత్సరాలుగా పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. మూడో ఏడాదికి జట్టు పగ్గాలు అతని చేతికి వచ్చాయి.

అనిల్‌ భాయ్‌ ఉండగా చింతేల

అనిల్‌ భాయ్‌ ఉండగా చింతేల

కెప్టెన్సీ తన ఆటను దెబ్బతీస్తుందో లేదో తెలియదని కేఎల్ రాహుల్‌ అంటున్నాడు. ప్రస్తుతం తనకు అప్పగించిన బాధ్యతలను ప్రశాంతంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానన్నాడు. సారథ్యంలో మెళుకువలు నేర్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు. అనుభవజ్ఞుడైన అనిల్‌ భాయ్‌ తన చెంతనుండటం అదృష్టమని పేర్కొన్నాడు. ఇన్నాళ్లూ క్రికెట్‌ ఆడకపోవడంతో ఆందోళన కలిగిందని, భయపడలేదని చెబితే అవాస్తమే అవుతుందని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్‌ రాహుల్ చెప్పాడు.

మూడు వారాల్లో లయ అందుకోవాలి

మూడు వారాల్లో లయ అందుకోవాలి

ఈ మూడు వారాల్లో లయ అందుకోవడం, బంతిని చక్కగా బాదడం, మనసు, శరీరం మధ్య సమన్వయం తీసుకురావడం కీలకమని లోకేష్ రాహుల్ పేర్కొన్నాడు. దుబాయ్‌, షార్జా, అబుదాబి పిచ్‌లు మందకొడిగా ఉంటే లక్ష్యాలు 180-190 నుంచి 160-170కి తగ్గుతాయని ఆయన పేర్కొన్నాడు. ఐపీఎల్ 2020లో భాగంగా యూఏఈలో క్వారంటైన్‌ పూర్తవడంతో చెన్నై సూపర్ కింగ్స్ మినహా ఇతర జట్లన్నీ ప్రాక్టీస్‌ మొదలెట్టాయి.

మన్కడింగ్‌కి బదులు రన్ పెనాల్టీ.. అశ్విన్ వ్యాఖ్యలకు పాంటింగ్ మద్దతు!!

Story first published: Thursday, September 3, 2020, 12:15 [IST]
Other articles published on Sep 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+