Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రేకప్ వార్తలకు స్వస్థి పలికిన అతియా.. లూడోలో రాహుల్‌ను ఓడించిన బాలీవుడ్ భామ!

KL Rahuls girlfriend Athiya Shetty rejects break-up rumours with epic response on throwback pic

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు. అయితే రాహుల్ బర్త్‌డే సందర్భంగా అతియా.. రాహుల్ నువ్వు నావాడివి.. అంటూ బర్త్‌డే విషెస్ తెలిపింది. అయితే ఆమె విషెస్‌కు రాహుల్ రిప్లే ఇవ్వలేదు.

దీంతో వీరి మధ్య ఏదో జరిగిందని, బ్రేకప్ అయిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల అతియా చేసి ఓ పోస్ట్ ఈ బ్రేకప్ వార్తలకు ఎండ్ కార్డ్ వేసేలా ఉంది. ఓ త్రోబ్యాక్ ఫొటోను షేర్ చేసిన అతియా దానికి..'ఇది ఒకప్పటి కలలా అనిపిస్తుంది'అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ కేఎల్ రాహుల్‌తో ఉండే ఆ త్రోబ్యాక్ పిక్‌లో.. కేవలం తన ఫొటో మాత్రమే కనిపించేలా ఈ బాలీవుడ్ భామ క్రాప్ చేసింది. అయితే ఈ ఫొటోలో రాహుల్ చేతి మాత్రం కనిపిస్తుంది. దీంతో ఓ అభిమాని అతనెవరని అడగ్గా.. తాను లూడోలో ఓడించిన వ్యక్తి అని సమాధానమిచ్చింది.

దీంతో ఈ క్రికెట్ కమ్ సినిమా జోడీ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని, వారి విడిపోలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైన చాలా మంది లూడో లాంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్న విషయం తెలిసిందే.

KL Rahuls girlfriend Athiya Shetty rejects break-up rumours with epic response on throwback pic

గ‌త సంవ‌త్స‌రం అతియా శెట్టి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాహుల్ ఆమెకు విషెస్ చెప్ప‌డంతో.. వీరిద్ద‌రి మధ్య ప్రేమ మొద‌లైంద‌ని అంతా అనుకున్నారు. ఆ వాద‌న‌ల‌కు బ‌లం చేకూరుస్తూ రాహుల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సునీల్ శెట్టి న‌టించిన 'హేరాపేరి' సినిమాలో అత్యంత పాపుల‌ర్ అయిన టెలిఫోన్ స‌న్నివేశాన్ని ఇమిటేట్ చేశాడు. రాహుల్ ఫోన్ మాట్లాడుతుండ‌గా.. అతియా ఫోన్ ప‌క్క‌న నిలుచొని కాయిన్ వేస్తుంది. అప్పుడు రాహుల్ ఫోన్‌లో 'హ‌లో దేవీ ప్ర‌సాద్' అంటాడు. అప్ప‌ట్లో ఈ పోస్ట్ బాగా వైర‌ల్ అయింది. ఈ ఫొటోనే క్రాప్ చేసి అతియా షేర్ చేసింది.

Story first published: Saturday, May 9, 2020, 10:56 [IST]
Other articles published on May 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+