కేఎల్ రాహుల్ శతకం.. టీమిండియా ఘనవిజయం!
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫామ్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా-ఏ జరిగిన రెండో అనధికారిక టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ వెటరన్ టీమిండియా బ్యాటర్ భారీ శతకంతో చెలరేగాడు. 210 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 176 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా సాయి సుదర్శన్(172 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 100) కూడా శతక్కొట్టడంతో ఈ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
412 పరుగుల భారీ లక్ష్యచేధనలో భారత్-ఏ 91.3 ఓవర్లలో 5 వికెట్లకు 413 పరుగులు చేసి గెలుపొందింది. రాహుల్, సాయి సుదర్శన్‌కు తోడుగా కెప్టెన్ ధ్రువ్ జురెల్(66 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(16 నాటౌట్)తో కలిసి కేఎల్ రాహుల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ జట్టు 420 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సాయి సుదర్శన్(75) మినహా అంతా విఫలమయ్యారు. 226 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 185 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, మనవ్ సుతార్ మూడేసి వికెట్లు తీయగా.. సిరాజ్, యశ్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌తో ఆధక్యంతో భారత్ ముందు 412 పరుగుల లక్ష్యం నమోదవ్వగా.. భారత్-ఏ 413 పరుగులు చేసి గెలుపొందింది.
అక్టోబర్ 2 నుంచి సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టీమిండియా రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన కరుణ్ నాయర్‌పై వేటు పడగా.. గాయంతో రిషభ్ పంత్ దూరమయ్యాడు. ఆకాష్ దీప్‌కు చోటు దక్కలేదు. రిషభ్ పంత్ గైర్హాజరీ నేపథ్యంలో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు జడేజాకు దక్కాయి. భారత్-ఏ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేసిన దేవదత్ పడిక్కల్‌కు అవకాశం దక్కగా..అభిమన్యు ఈశ్వరన్‌కు నిరాశే ఎదురైంది.
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్,కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications