Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే రిషభ్ పంత్‌ను తీసుకోలేదు: కేఎల్ రాహుల్

సౌతాఫ్రికాతో రెండో వన్డేలోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ పిచ్ గురించి చెప్పడం కష్టం. రాత్రి అయ్యే కొద్దీ మంచు కురిసే అవకాశం ఉంది. బంతి స్కిడ్ అవుతూ.. బ్యాటింగ్‌కు సులువవుతుందని ఆశిస్తున్నాం. కానీ ఇలానే ఉంటుందని చెప్పడం కష్టం.

గత మ్యాచ్‌లో ఓడినా మాకు చాలా సానుకూలతలు ఉన్నాయి. మా బ్యాటింగ్ తొలి 10 ఓవర్లలో విఫలమైనా.. ఆఖరి వరకు పోరాడాం. తుది జట్టులో మూడు మార్పులు చేశాం. నాతో పాటు కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ మాకు చాలా కీలకం. ఈ సిరీస్‌ను సజీవంగా ఉంచడానికి మాకు ఇది మంచి అవకాశం.'అని బవుమా చెప్పుకొచ్చాడు.

KL Rahul Reveals Why Rishabh Pant Was Benched for the 2nd ODI Against South Africa

మరోవైపు టాస్ ఓడిపోవడం తనపై ఒత్తిడి పెంచుతుందని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలనే తుది జట్టు మార్పులు చేయలేదని స్పష్టం చేశాడు. దాంతోనే రిషభ్ పంత్‌తో సహా బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కలేదన్నాడు. 'నిజాయితీగా చెప్పాలంటే.. ఇది నాపై అత్యధిక ఒత్తిడిని పెంచుతుంది. ఎందుకంటే మేం చాలా కాలంగా టాస్ గెలవలేదు. నేను ప్రాక్టీస్ చేస్తున్నా కలిసి రావడం లేదు. గత మ్యాచ్‌లో మేం అద్భుతమైన ప్రదర్శన చేశాం. ఆ మ్యాచ్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. వాటిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అద్భుతంగా పోరాడింది. మా కుర్రాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. డ్యూ గురించి మేం సిరీస్‌కు ముందే మాట్లాడుకున్నాం.

ప్రస్తుతం ఇది భారత్‌లో చాలా మంచు కురిసే సమయం. మేం ఆడే ప్రతీ చోట మంచు కురుస్తుంది. బౌలర్లంతా డ్యూ ఫ్యాక్టర్ గురించే చర్చించుకున్నారు. అందుకు తగ్గట్లుగా వ్యూహాలు కూడా రచించాం. గత మ్యాచ్ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. భారీ లక్ష్యాన్ని నమోదు చేసి ఆరంభంలో వికెట్లు తీస్తే ఈ మ్యాచ్‌ గెలవడం సులువవుతుంది. పిచ్ బాగానే కనిపిస్తోంది. ఏ జట్టు అయినా సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ప్రధాన కారణం డ్యూ ఫ్యాక్టర్ మాత్రమే. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలనే ఉద్దేశంతో తుది జట్టులో మార్పులు చేయలేదు. దాంతోనే బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కలేదు.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

సౌతాఫ్రికా: క్వింటన్ డి కాక్ (w), ఐడెన్ మార్క్రామ్, టెంబా బవుమా (c), మ్యాథ్యూ బ్రీట్జ్‌కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎంగిడి.

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Story first published: Wednesday, December 3, 2025, 14:03 [IST]
Other articles published on Dec 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+