For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: టీ20 సిరీస్‌లో అందుకే విఫలమయ్యా: కేఎల్‌ రాహుల్‌

KL Rahul reveals why he loss form in T20I series against England
#IndvEng : #KLRahul Reveals Why He Loss Form In T20I Series Against England

పూణే: ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో తాను ఎందుకు విఫలమయ్యాడో చెప్పాడు టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌. మూడు నెలలు క్రికెటేమీ ఆడకపోవడం వల్లే టీ20 సిరీసులో విఫలమయ్యానని స్పష్టం చేశాడు. భారత జట్టులో పోటీ ఎక్కువగా ఉంటుందని, ఏదో ఒక స్థానం మనకుంటుందని హాయిగా కూర్చోలేమన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్‌ కోల్పోయి సతమతం అవ్వడం సాధారణమేనని కేఎల్‌ తెలిపాడు. రాహుల్ వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో 1,0, 0, 14 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో మాత్రం అర్ధ శతకంతో రాణించాడు.

 మ్యాచులు ఆడుతుంటే నా లయ బాగుంటుంది:

మ్యాచులు ఆడుతుంటే నా లయ బాగుంటుంది:

రెండో వన్డేకు ముందు కేఎల్‌ రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ... 'నిరంతరం మ్యాచులు ఆడుతుంటే నా లయ బాగుంటుంది. నాకు ఇష్టమైనంత గేమ్‌ టైమ్‌ దొరక్కపోతే ఇబ్బంది పడతాను. నా మదిలో అదే మెదులుతూ ఉంటుంది. అందుకే సన్నద్ధమయ్యేందుకు ఏదో ఒక దారి వెతకాలి. అది శిక్షణైనా కావొచ్చు లేదా ఓపెన్‌ నెట్‌ సెషన్‌ అయినా కావొచ్చు. నేను సన్నద్ధమయ్యేందుకు సాధ్యమైనంత ప్రయత్నిస్తాను. కానీ మ్యాచ్‌లు ఆడటానికి ఏదీ సాటిరాదు. మ్యాచ్ ఆడితే అదో కిక్కు. నా సన్నద్ధతపై విశ్వాసం వల్లే వన్డేలో పుంజుకోగలిగా' అని అన్నాడు.

 పోటీ ఎక్కువగా ఉంటుందని తెలుసు:

పోటీ ఎక్కువగా ఉంటుందని తెలుసు:

రిషబ్ పంత్, ఇషాన్‌ కిషన్‌ వంటి వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ పోటీకి రావడంపై లోకేష్ రాహుల్‌ స్పందించాడు. 'భారత జట్టులో ఉన్నప్పుడు పోటీ ఎక్కువగా ఉంటుందని తెలుసు. ఏదో ఒక స్థానం మనకు కచ్చితంగా ఉంటుందని హాయిగా కూర్చోలేం. మనకెప్పుడూ సవాళ్లు ఎదురవుతాయి. మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. ఎందరో యువ ఆటగాళ్లు వస్తున్నారు. అందుకే ముందుకెళ్లేందుకు మరింత కష్టపడాలి. ఆటను ఎప్పుడూ మెరుగుపర్చుకోవాలి. అవకాశం దొరికినప్పుడు రెండు చేతులతో అందిపుచ్చుకోవాలి' అని రాహుల్‌ చెప్పాడు.

 ఫామ్‌ కోల్పోవడం ప్రయాణంలో భాగమే:

ఫామ్‌ కోల్పోవడం ప్రయాణంలో భాగమే:

అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్‌ కోల్పోయి సతమతం అవ్వడం సాధారణమేనని కేఎల్‌ రాహుల్ అంటున్నాడు. 'ఫామ్‌ కోల్పోవడం ప్రయాణంలో భాగమే. ఈ దశ అందరికి ఎదురవుతుంది. అందుకే మరీ ఆందోళన పడను. రిజర్వు బెంచీపై ఉన్నప్పుడు ఆటగాడిగా నిరాశపడతాం. మూడు, నాలుగు నెలల తర్వాత జట్టులోని మిగతావాళ్లలా ఆడాలనుకుంటాం. అలా జరగకపోతే అప్పుడు బాధపడాలి. ఇక మ్యాచ్‌కు సన్నద్ధత స్థాయికి తగినట్టు ఉందో లేదో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేను అలాగే చేస్తా. అలా ప్రశ్నించాక పరుగులు చేయకపోతే అప్పుడు ఆందోళన పడతా' అని రాహుల్ పేర్కొన్నాడు.

బాగా ఆడకపోతే నిరాశపడతాం:

బాగా ఆడకపోతే నిరాశపడతాం:

'దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బాగా ఆడకపోతే నిరాశపడతాం. బాగా ఆడి దేశానికి విజయాలు అందిస్తూనే ఉండాలి. అయితే ప్రతిసారీ ఆ పని చేయలేకపోవచ్చని మాత్రం అంగీకరించాలి. గత రెండున్నరేళ్లుగా నాకు అప్పజెప్పిన ప్రతి పాత్రను పోషించాను. జట్టును ముందుకు నడిపాను. అన్నీ సవ్యంగా సాగుతున్నప్పుడు నా ప్రక్రియ, అభిరుచి, అంకితభావాన్ని ప్రశ్నించుకోను. రెండు, మూడు చెత్త ప్రదర్శనలను అతిగా విశ్లేషించుకోను' అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

Orleans Masters: క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సైనా నెహ్వాల్!!

Story first published: Thursday, March 25, 2021, 19:44 [IST]
Other articles published on Mar 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+