Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టాం: కేఎల్ రాహుల్

IND vs SA 3rd ODI: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మళ్లీ టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా టాస్ ఓడిపోవడం గమనార్హం.

ఊహించినట్లుగానే చివరి మ్యాచ్‌లో యువ ప్లేయర్, ఆర్‌సీబీ స్టార్ రజత్ పటీదార్‌కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌తో రజత్ పటీదార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. రుతురాజ్ గైక్వాడ్‌ వేలికి గాయం కావడంతో అతన్ని తప్పించాల్సి వచ్చిందని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు రెస్ట్ ఇచ్చామని చెప్పిన రాహుల్.. వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడని చెప్పాడు.

KL Rahul Reveals The Reason Why Ruturaj Gaikwad Not Playing in 3rd ODI against 3rd ODI

'ఈ మ్యాచ్‌కు తుది జట్టులో రెండు మార్పులు చేశాం. రజత్ పటీదార్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ వేలి గాయంతో బాధపడుతుండటంతో అతని స్థానంలో రజత్ పటీదార్ జట్టులోకి వచ్చాడు. ఇక కుల్దీప్ యాదవ్‌కు రెస్ట్ ఇవ్వగా.. వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.

ముందుగా బ్యాటింగ్ చేయడం ఇబ్బంది ఏం లేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ ఒకేలా ఉండే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో మంచి పోజిషన్‌లో ఉన్న మేం చివర్లో తడబడ్డాం. 40 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బ తీసింది. ఈ రోజు శుభారంభం అందుకోవాలని భావిస్తున్నాం. కుర్రాళ్లకు ఇది మరో అవకాశం. గత రెండు మ్యాచ్‌ల్లోని పిచ్ కంటే ఇది బాగుంది. ఈ మ్యాచ్‌లో మేం భారీ స్కోర్ చేస్తామని భావిస్తున్నాం.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిచిన ఎయిడెన్ మార్క్‌రమ్.. ఛేజింగ్‌లో తమ సత్తా తెలుసుకునేందుకు బౌలింగ్ ఎంచుకున్నామని చెప్పాడు. 'ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం. వీలైనంత తక్కువ స్కోర్‌కు భారత్‌ను కట్టడి చేయడం మా ప్రణాళిక. ఈ మైదానం చాలా పెద్దది. బౌండరీలు బాదడం కంటే పరుగెత్తడం చాలా ముఖ్యం. 'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

భారత్: సంజూ శాంసన్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.

సౌతాఫ్రికా: రీజా హెండ్రీక్స్, టోనీ డీ జోర్జీ, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, లిజాడ్ విలియమ్స్, బ్యూరన్ హెండ్రీక్స్.

Story first published: Thursday, December 21, 2023, 16:31 [IST]
Other articles published on Dec 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+