
ఢాకా: భారత్‌తో రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు స్వల్ప మార్పులతో బరిలోకి దిగాయి. ఏకైక మార్పు చేసిన టీమిండియా కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ జయదేవ్ ఉనాద్కత్‌ను తీసుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ మార్పు చేయాల్సి వచ్చిందని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకోవాలని భావించామని చెప్పిన రాహుల్.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్నాడు.
సాధారణంగా ఇక్కడ బౌన్స్ ఉంటుందని, పేసర్లు, స్పిన్నర్లకు కూడా అడ్వాంటేజ్ ఉంటుందన్నాడు. పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నా గుడ్ క్రికెట్ ఆడటం ముఖ్యమని చెప్పాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ బాగా చేస్తే మ్యాచ్‌పై పట్టు బిగించవచ్చని తెలిపాడు. ఆరంభంలో వికెట్లు తీయడం చాలా ముఖ్యమని చెప్పిన రాహుల్... తప్పని పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టాల్సి వచ్చిందన్నాడు. ఇక ఉనాద్కత్‌కు ఇది గొప్ప అవకాశమని చెప్పాడు.
బంతి పాతబడే వరకు తొలి రెండు గంటలు జాగ్రత్తగా ఆడితే ఈ పిచ్ భారీ స్కోర్ చేయవచ్చని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. సాధారణంగా ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించినా.. ఫాస్ట్ బౌలర్లకు సహకారం ఉంటుందని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన షకీబ్.. యాసిర్ స్థానంలో మోమినల్, ఎబాదత్ ప్లేస్‌లో టస్కిన్ ఆడుతున్నారని తెలిపాడు.
బంగ్లాదేశ్‌ను తొలి టెస్టులో చిత్తుగా ఓడించిన ఉత్సాహంలో ఈ రెండో టెస్టును కూడా నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా చూస్తోంది. బంగ్లాపై తొలి టెస్టులో విజయం సాధించడం, అదే సమయంలో ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా పరాజయం పాలవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సఫారీ జట్టును వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ తన చివరి టెస్టు సిరీస్‌ను సొంతగడ్డపై ఆడబోతోంది. ఆ సిరీస్‌లోనూ గెలిస్తేనే ఫైనల్ బెర్తు దక్కుతుంది కానీ.. అంతకంటే ముందు బంగ్లాపై టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు అవసరం. అలా కాని పక్షంలో భారత్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి. కాబట్టి ఈ రెండో టెస్టులో ఉదాసీనతకు అవకాశమే ఇవ్వకూడదు.
తుది జట్లు:
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సెన్ షాంటో, జకీర్ హసన్, మోమినల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), నురుల్ హసన్, మెహ్‌దీ హసన్ మీరాజ్, తైజుల్ ఇస్తామ్, ఖలీల్ అహ్మద్, టస్కిన్ అహ్మద్
భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనాద్కత్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్