Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే ఓపెనింగ్ చేయలేదు: కేఎల్ రాహుల్

KL Rahul reveals the reason why he did not open for India against Zimbabwe

హరారే: జింబాబ్వే గడ్డపై భారత జట్టు శుభారంభం చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. గాయాలతో చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్న కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ పేసర్ దీపక్ చాహర్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా సత్తా చాటారు. అయితే కీలక ఆసియా కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్‌ ఎలా ఆడుతాడనే అందరూ ఎదురు చూస్తుండగా.. అతను మాత్రం అందరికీ షాకిచ్చాడు. ఓపెనర్‌గా వస్తాడనుకున్న రాహుల్.. ధావన్‌కు తోడుగా శుభ్‌మన్ గిల్‌ను పంపించాడు. దాంతో అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు సైతం నివ్వెరపోయారు.

టీమ్‌మేనేజ్‌మెంట్ సూచనలతోనే..

టీమ్‌మేనేజ్‌మెంట్ సూచనలతోనే..

అసలు జట్టులో కేఎల్ రాహుల్ పాత్ర ఏందనే చర్చకు తెరలేపారు. ఇక తొలి వన్డే విజయానంతరం కేఎల్ రాహుల్ తన రోల్‌పై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. టీమ్ మేనేజ్‌మెంట్ సూచనల మేరకే తాను ఓపెనింగ్ చేయలేదని చెప్పాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌గిల్‌కు అవకాశమిచ్చామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో జట్టుగా రాణించి విజయాన్నందుకున్నామని సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బౌలర్ల ప్రదర్శన అద్బుతమని కొనియాడాడు. 'మేం చాలా క్రికెట్ ఆడుతాము కాబట్టి గాయాల బారిన పడటం సహజం. అవి ఆటలో భాగమే. అయితే ఆటకు దూరంగా ఉండటం చాలా కష్టం.

చాలా సంతోషంగా ఉంది..

ఇన్నాళ్లు నాతో పాటు కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. బెంగళూరులో మేం ముగ్గురం రిహాబిలిటేషన్‌లో ఉన్నాం. రిహాబిలిటేషన్‌లో ప్రతీ రోజు చికాకు పుట్టిస్తోంది. టీమ్ ఫిజియోలతో ఉండటం కంటే మైదానంలో గడపడానికే ఇష్టం పడతాం. మొత్తానికి మళ్లీ మైదానంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. వికెట్‌పై ఉన్న స్వింగ్, సీమ్ పరిస్థితులను సరిగ్గా వాడుకుంటూ చెలరేగారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. జట్టుగా మేం మంచి ఫామ్‌లో ఉన్నాం. మా అందరికి ఆడే అవకాశం లభిస్తుండటం బాగుంది.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

మిడిలార్డర్ బ్యాటర్‌గా..

వికెట్ కీపర్, ఓపెనర్, మిడిలార్డర్ ఇలా జట్టుకు ఏది అవసరమైతే ఆ పాత్ర పోషించేందుకు రాహుల్ ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. అందుకే రాహుల్‌ను మళ్లీ మిడిలార్డర్‌లో ఆడించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. టీ20ల్లో సూర్యకుమార్‌‌‌ను ఓపెనర్‌గా ఆడిస్తూ చేసిన ప్రయోగం సక్సెస్ కావడం.. వన్డేల్లో రోహిత్ శర్మకు శిఖర్ ధావన్ తోడుండటంతో రాహుల్‌ను మిడిలార్డర్‌కు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి రాహుల్‌కు మిడిలార్డర్‌లో మంచి రికార్డు ఉంది. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు రాహుల్ 56.63 సగటుతో 453 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో 41.5 సగుటుతో రాణించాడు. ఓపెనింగ్ కంటే ఈ గణంకాలే మెరుగ్గా ఉన్నాయి.

దీపక్ చాహర్ తీన్మార్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ రెగిస్‌ చకాబ్వా (51 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచర్డ్‌ ఎన్‌గరవా (42 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఇవాన్స్‌ (29 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్, సీమర్లు దీపక్‌ చహర్, ప్రసిధ్‌ కృష్ణ తలా 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్‌ 30.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా 192 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌ (72 బంతుల్లో 82 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌), ధావన్‌ (113 బంతుల్లో 81 నాటౌట్‌; 9 ఫోర్లు) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించేశారు. చహర్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అభించింది. శనివారం ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది.

Story first published: Friday, August 19, 2022, 7:40 [IST]
Other articles published on Aug 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+