
భారీ షాట్ ఆడుదామని..
ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన రాహుల్.. తన సెంచరీపై సంతోషం వ్యక్తం చేశాడు.'నేను శతకానికి ఒక పరుగు దూరంలో ఉండగా స్పిన్ బౌలింగ్‌లో సింగిల్ లేదా భారీషాట్ ఆడాలనుకున్నా. అప్పుడు ఫీల్డర్లంతా సర్కిల్‌లోనే ఉండటంతో భారీ షాట్ ఆడుదామని టెంప్ట్ అయ్యా. కానీ, దాన్ని విరమించుకున్నా. నేను ఈ ఏడాది లార్డ్స్‌లో శతకం బాదినప్పుడు కూడా ఇలాంటి ఫీలింగే కలిగింది. ఈ రెండు సందర్భాల్లో ఎంతో ప్రశాంతంగా బ్యాటింగ్ చేసిన తీరు నాకే ఆశ్చర్యమేస్తుంది. అయితే, నేను ఆ సింగిల్ తీసి సెంచరీ చేయాలని అనుకోలేదు.

సంతోషంగా ఉంది..
ఆ ఒక్క బంతిని మాత్రమే అలా భారీ షాట్ ఆడాలని అనుకున్నా. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకున్నా. చివరికి మా జట్టును మంచి స్థితిలో నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది' అని రాహుల్ చెప్పుకొచ్చాడు. మరోవైపు కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 90 పరుగుల్లోకి వచ్చిన రాహుల్.. ఆ తర్వాత నిదానంగా బ్యాటింగ్ చేస్తూ ఒక్కో పరుగుతో 99కి చేరుకున్నాడు. ఆపై బౌండరీ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. టెస్ట్ కెరీర్‌లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ తరఫున సౌతాఫ్రికాలో టెస్టు క్రికెట్‌లో మూడంకెల స్కోర్ అందుకున్న రెండో ఓపెనర్‌గా నిలిచాడు. ఇక రాహుల్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

భారత్ 272/3
కేఎల్ రాహుల్ అజేయ సెంచరీ సాధించడంతో తొలి రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (123 బంతుల్లో 9ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాహుల్.. మయాంక్‌తో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కోహ్లీ (94 బంతుల్లో 4ఫోర్లతో 35), అజింక్యా రహానే ( 81 బంతుల్లో 8 ఫోర్లతో 40 బ్యాటింగ్)తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పుజారా డకౌటయ్యాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లనూ ఎంగిడి (3/45) పడగొట్టాడు. మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.

రెండో రోజు ఆట రద్దు..
వర్షం కారణంగా రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచి పెట్టుకుపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా మారింది. లంచ్ బ్రేక్ ముగిసినా వరుణుడు కరుణివ్వకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేశారు. మూడో రోజు కొంచెం ముందుగానే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గంటలకే ఆటను ప్రారంభించనున్నారు. అయితే ఒక రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో మ్యాచ్ ఫలితం తేలడం కష్టంగా మారింది. పైగా ఇక సౌతాఫ్రికా వెదర్ ఫోర్ కాస్ట్ ప్రకారం.. మూడు, నాలుగో రోజు వర్షం వచ్చే సూచన లేకున్నా.. చివరి రోజు వర్షం పడే అవకాశం ఉంది. దాంతో వచ్చే రెండు రోజులు ఆట జరిగినా.. ఫలితం తేలడం కష్టం.


Click it and Unblock the Notifications
